సినిమాలో ఆడియన్స్ కి ఊహించని ట్విస్ట్.. తుపాకీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ‘కాగితం పడవలు’ టీమ్ రివీల్!

టాలీవుడ్ కొత్త హీరో హీరోయిన్లుగా వర్ధన్, కృష్ణప్రియ తో ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ ‘కాగితం పడవలు’ సెప్టెంబర్ 18న విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులు అస్సలు ఊహించని ట్విస్టులు, హృదయాన్ని హత్తుకునే ఎమోషన్లతో రాబోతోంది.

Update: 2026-09-13 09:30 GMT

టాలీవుడ్ కొత్త హీరో హీరోయిన్లుగా వర్ధన్, కృష్ణప్రియ తో ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ ‘కాగితం పడవలు’ సెప్టెంబర్ 18న విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులు అస్సలు ఊహించని ట్విస్టులు, హృదయాన్ని హత్తుకునే ఎమోషన్లతో రాబోతోంది. ముఖ్యంగా థియేటర్ నుంచి బయటకు వచ్చినా వెంటాడే క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది అని ప్రొడ్యూసర్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. తాజాగా తుపాకీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో చిత్రయూనిట్ హీరో వర్ధన్, హీరోయిన్ కృష్ణప్రియ, ప్రొడ్యూసర్ కీర్తన పాల్గొని సినిమా విశేషాలు పంచుకున్నారు ..

సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల:

ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, టీఆర్ ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మంచి బజ్ నడుమ ఈ గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రేమకథ సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఎమోషనల్ అండ్ హాంటింగ్ క్లైమాక్స్:

ఇక సాధారణ లవ్‌స్టోరీలా ప్రారంభమైనా, సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేస్తాయని చిత్రయూనిట్ తెలిపింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ ప్రేక్షకులను తీవ్రమైన భావోద్వేగానికి గురిచేస్తుందని, సినిమా చూసి బయటకు వచ్చాక కూడా ఆ ఎమోషన్ చాలా కాలం పాటు వారిని వెంటాడుతుందని ధీమా వ్యక్తం చేశారు హీరో వర్ధన్ తెలిపారు.

రూరల్ లవ్ థ్రిల్లర్ – విభిన్నమైన కథాంశం :

ఇది కేవలం ఒక రొటీన్ రొమాంటిక్ డ్రామా మాత్రమే కాకుండా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన రూరల్ లవ్ స్టోరీ. నేటి సమాజంలో ఉన్న కొన్ని సున్నితమైన అంశాలను కూడా ఇందులో ఎంతో సహజంగా, ఆకట్టుకునేలా స్పృశించినట్లు యూనిట్ వివరించింది.

హీరోయిన్ కృష్ణప్రియ అనుభవాలు:

మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో నటించిన హీరోయిన్ కృష్ణప్రియకు తెలుగులో ఇది రెండో సినిమా. తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్‌ను, కొత్త నటులను చాలా ఆదరిస్తారని ఆమె ప్రశంసించారు. ఇక చిన్నతనంలో అల్లు అర్జున్ 'హ్యాపీ' సినిమా చూశానని, టాలీవుడ్‌లో పనిచేయడం చాలా కంఫర్టబుల్‌గా ఉందంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు.

డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ విజన్:

కొత్త దర్శకుడు ఎంజీఆర్ తుకారాం ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఒక డ్రీమ్‌ను నెరవేరుస్తూ నటీనటులపై నమ్మకంతో ప్రాజెక్ట్‌ను ముందుకు నడిపిన నిర్మాతలు కీర్తన నరేష్, ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల గార్లకు చిత్రబృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

మంచి కథ, ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో వస్తున్న 'కాగితం పడవలు' ఖచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా. సెప్టెంబర్ 18న విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొంది బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలని కోరుకుందాం. థియేటర్లలో ఈ ఎమోషనల్ రైడ్‌ను మిస్ కాకండి..ఇక ఈ సినిమా లవ్ సీన్స్ గురించి మరింత తెలుసుకోవాలి అంటే తుపాకీ న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా ప్రసారమవుతున్న కాగితం పడవలు టీమ్ స్పెషల్ ఇంటర్వ్యూ చూసేయండి.



Full View


Tags:    

Similar News