వీడియో: త్రిష చెంత‌కు రాగానే CM విజ‌య్ చ‌టుక్కున త‌ల తిప్పేశాడెందుకు?

బ్రిటన్‌లోని ప్ర‌ఖ్యాత‌ సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌లో జరిగిన `లీ మాన్స్ కప్ రేస్` కేవలం ఒక మోటార్‌స్పోర్ట్ ఈవెంట్‌గానే కాకుండా.. ఊహించని పరిణామాలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Update: 2026-09-13 06:16 GMT

బ్రిటన్‌లోని ప్ర‌ఖ్యాత‌ సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌లో జరిగిన `లీ మాన్స్ కప్ రేస్` కేవలం ఒక మోటార్‌స్పోర్ట్ ఈవెంట్‌గానే కాకుండా.. ఊహించని పరిణామాలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. త‌మిళ స్టార్ హీరో కం రేస‌ర్ అజిత్ కుమార్ రేసింగ్ స్టైల్ ను తిలకించడానికి.. ముఖ్యమంత్రి హోదాలో అక్కడకు వెళ్లిన సి. జోసెఫ్ విజయ్ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. అనూహ్యంగా ఆ వేదికపై నటి త్రిష ప్రత్యక్షమవడం ఇప్పుడు తమిళ చిత్రసీమలోనూ, నెట్టింటనూ తీవ్ర చర్చకు దారితీసింది.

లండన్‌లో జరుగుతున్న ఒక సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్లిన త్రిష.. సిల్వర్‌స్టోన్ రేస్ జరుగుతున్న ప్రదేశానికి రావడం ఊహాగానాలకు తెరదించింది. గతంలో మే నెలలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి.. ఆగస్టులో జరిగిన స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలకు కుటుంబ సభ్యుల మధ్య హాజరైన త్రిష.. ఇప్పుడు ఏకంగా విదేశీ గడ్డపై కూడా విజయ్ పక్కనే కనిపించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా వినిపిస్తున్న రూమర్స్‌కు ఈ తాజా ఘటన మరింత బలాన్ని చేకూర్చింది.

ఈ రేస్ ఈవెంట్‌కు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే ఈ వీడియోలో ఒక ఆసక్తికరమైన దృశ్యం నెటిజన్ల కంట పడింది. త్రిష ఫ్రేమ్‌లోకి ప్రవేశించి పక్కన నిలబడగానే.. విజయ్ ఒక్కసారిగా కెమెరా వైపు నుంచి తన ముఖాన్ని పక్కకు తిప్పుకోవడం గమనించవచ్చు. ఇది ఒక సాధారణ సహజ ప్రతిచర్య అని కొందరు వాదిస్తుంటే.. విజయ్ కొంచెం అసౌకర్యంగా లేదా చిరాగ్గా కనిపించాడని మరికొందరు భిన్నమైన విశ్లేషణలు చేస్తున్నారు. లేదు త‌మ‌ను మీడియా గ‌మ‌నిస్తూనే ఉంటుంది గ‌నుక సీఎం విజ‌య్ చ‌టుక్కున త‌ల తిప్పేస్తూ త్రిష చెవిలో ఏదో చెబుతున్నాడ‌ని కూడా కొంద‌రు ఊహించారు. దీని వెనుక అసలు కారణం ఏమిటనే దానిపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు.

అజిత్-విజయ్‌ల అరుదైన మైత్రిని.. వారి హ్యాపీ ఫ్రెండ్లీ కలయికను చూసి మురిసిపోయిన అభిమానులకు సోషల్ మీడియాలో త్రిష ఎంట్రీ త‌ర్వాత సీన్ పెద్ద షాకే ఇచ్చింది. ఫ్యాన్ వార్స్ వ‌దిలేసి అజిత్- విజ‌య్ ఇద్దరు హీరోలు కలిసి సంతోషంగా ఉన్నారనే ఆనందం సోషల్ మీడియాలో వ్యక్తమయ్యే లోపే.. ఈ విజువల్స్ యూత్ ని బాగా డిస్ట్ర‌బ్ చేసాయి. ఆన్‌లైన్ ఫీడ్స్‌లో ఈ సెలబ్రిటీ వీడియోల మధ్యలో ఊహించని ప్రకటనలు, స్పాన్సర్డ్ యాడ్స్ ప్రత్యక్షమవడం.. మరోవైపు కొందరు రాజకీయ -ట్రోలింగ్ కామెంట్లతో స్పందించడం ఆన్‌లైన్ వేదికల్లో విపరీతమైన గందరగోళానికి దారితీసింది.

మొత్తానికి సిల్వర్‌స్టోన్ రేస్ వీకెండ్ అనేది కేవలం ఒక క్రీడా వేడుకలా కాకుండా.. సినిమా సెలబ్రిటీల వ్యక్తిగత సమీకరణాలు, సోషల్ మీడియా ట్రోలింగ్ అల్గారిథమ్‌ల కలయికగా మారిపోయింది. ఒకవైపు ఇద్దరు టాప్ హీరోల కలయిక ఇస్తున్న పాజిటివ్ వైబ్స్... మరోవైపు త్రిష రాకతో మొదలైన ఊహాగానాలు... సోషల్ మీడియాలో జరిగే క్షణికావేశపు చర్చలు ఈ ట్రెండ్‌ను ఇంటర్నెట్‌లో అత్యంత ఎక్కువగా చర్చించుకునే అంశంగా మార్చాయి.




Tags:    

Similar News