తండ్రి రోల్.. మైనస్ కాదు ప్లస్సే!
హీరో అంటే యూత్ లుక్ ఉండాలి.. లవ్ స్టోరీలు చేయాలి.. వయసుకు తగ్గ పాత్రల్లోనే కనిపించాలి.
హీరో అంటే యూత్ లుక్ ఉండాలి.. లవ్ స్టోరీలు చేయాలి.. వయసుకు తగ్గ పాత్రల్లోనే కనిపించాలి. సాధారణంగా హీరోల విషయంలో ఇలాంటి లెక్కలు ఉంటాయి. కానీ టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ మాత్రం ఆ లెక్కలను పట్టించుకోకుండా తనకు వచ్చిన పాత్రలో నటుడిగా మెప్పించే ప్రయత్నం ఇస్తున్నారు. అందుకే ఒక కుర్రాడికి తండ్రిగా కనిపించినా.. అది కెరీర్ కు మైనస్ కాకుండా ప్లస్ గా మారింది!
సుహాస్ కు నటుడిగా మంచి పేరు ఎప్పటి నుంచో ఉంది. కలర్ ఫోటోతోనే తనలోని నటుడిని చూపించాడు. ఆ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత రైటర్ పద్మభూషణ్ మంచి విజయాన్ని అందించింది. కానీ ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో సుహాస్ కు బ్రేక్ ఎప్పుడు వస్తుందా అనే చర్చ కూడా నెట్టింట జరిగింది.
ఇలాంటి సమయంలో తమిళ సినిమా మండాడిలో ఛాన్స్ వచ్చింది. సినిమాలో సుహాస్ ఒక కుర్రాడికి తండ్రిగా కనిపించారు. సాధారణంగా హీరోగా కెరీర్ ను కన్స్ట్రక్ట్ చేసుకుంటున్న సమయంలో ఇలాంటి రోల్ చేయడం కొంత రిస్క్ అనే చెప్పాలి. ముఖ్యంగా యూత్ హీరో ఇమేజ్ ఉన్న నటుడికి ఇది ఎలా వర్కౌట్ అవుతుందనే డౌట్లు రావడం కామన్. కానీ సినిమా విడుదలైన తర్వాత మాత్రం ఆ లెక్కలన్నీ మారిపోయాయి.
తండ్రి పాత్రలో కనిపించడం సుహాస్ కు ఎక్కడా ఇబ్బందిగా మారలేదు. హీరోగా కనిపించాలనే ఆలోచన కంటే.. రోల్ ఏం కోరుకుంటుందో దానికి తగ్గట్టు నటించడమే స్ట్రెంత్ గా మారింది. పైగా సుహాస్ కు తమిళం రాదు. సినిమాలో డబ్బింగ్ ను కూడా మరో వ్యక్తితో చెప్పించారు. అయినా ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్ తో పాత్రను స్ట్రాంగ్ గా నిలబెట్టారు. లాంగ్వేజ్ తెలియకపోయినా యాక్టింగ్ తో ప్రేక్షకులకు కనెక్ట్ కావడం అంత ఈజీ కాదు. కానీ సుహాస్ ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు.
ముఖ్యంగా సూరి స్నేహితుడి కొడుకును చంపడానికి సిద్ధమయ్యే సీన్స్ లో సుహాస్ ఇంటర్సిటీ ఆకట్టుకుంటుంది. ఊరి పెద్దలు పంచాయితీ పెట్టినప్పుడు వారిని ఎదిరించే సన్నివేశంలోనూ తన రోల్ స్ట్రెంత్ ను చూపించారు. సముద్రంలో షూట్ చేసిన సీన్స్ లో రిస్క్ తీసుకోవడం సినిమాకు స్పెషాలిటీగా నిలిచింది. ఇక సూరి ఈ మధ్య తన ఇంటెన్స్ యాక్టింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటి యాక్టర్ ఎదురుగా ఉన్నా సుహాస్ తన రోల్ లో కనిపించాల్సిన చోట కనిపించారు.
దీంతో తండ్రి పాత్ర చేసినా హీరోగా తన గుర్తింపు తగ్గలేదు. పైగా నటుడిగా తన రేంజ్ మరింత పెరిగిందనే అభిప్రాయం వచ్చింది. అందుకే మండాడిలో సుహాస్ తండ్రి పాత్రను మైనస్ గా చూడాల్సిన అవసరం లేదు. అదే పాత్ర ఆయన యాక్టింగ్ లోని మరో యాంగిల్ ను చూపించింది. హీరో అంటే ఒకే రకమైన పాత్రల్లో కనిపించాల్సిన అవసరం లేదని సుహాస్ మరోసారి ప్రూవ్ చేశారనే చెప్పాలి.