సమంత చేతులకు మెహందీ.. కనిపించలేదా రాజ్!
ఇకపోతే ఎరుపు రంగు శారీలో కుందనపు బొమ్మలా రెడీ అయి సమంత రాజ్ నిడిమోరుని పెళ్లాడింది.;
సమంత , రాజ్ నిడిమోరులు ఎట్టకేలకు పెళ్లి చేసుకొని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి గురించి చాలా రోజుల నుండి వస్తున్న పుకార్లకు తెర దించుతూ.. ఈశా యోగా సెంటర్ సమీపంలో ఉన్న లింగ భైరవి అమ్మవారి ఆలయంలో భూత శుద్ధి పద్ధతిలో దంపతులుగా ఒక్కటయ్యారు. పెళ్లైయ్యాక ఈ జంట తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో ఇప్పుడు ఒక విషయం కాస్త బయటపడింది.
ఇకపోతే ఎరుపు రంగు శారీలో కుందనపు బొమ్మలా రెడీ అయి సమంత రాజ్ నిడిమోరుని పెళ్లాడింది. ఇప్పటికే సమంత - రాజ్ నిడిమోరులకు సంబంధించిన పెళ్లి ఫోటోలు.. సమంతని రాజ్ నిడిమోరు ఫ్యామిలీలోకి ఆహ్వానించిన ఫోటోలు ఇలా ఎన్నో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో మరో ఫోటో వైరల్ అవుతుంది.
అదేంటంటే రాజ్ నిడిమోరు.. సమంత మెహందీని జూమ్ చేసి మరీ చూస్తున్న ఫోటో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటోలో ఏముందంటే.. రాజ్ నిడిమోరు సమంత పక్కనే కూర్చొని సమంత చేతికి పెట్టుకున్న మెహందీలో తన పేరు ఎక్కడ ఉందో అని వెతుకుంటున్నట్టు కనిపిస్తోంది.తన ఫోన్లో సమంత చేతి మెహందీని ఫోటో తీసి తన పేరు ఎక్కడుంది అని జూమ్ చేసి మరీ తెగ వెతుక్కుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు వీరి ఫోటోలకి రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కొంతమందేమో సమంత రెండో పెళ్ళైనా సవ్యంగా ఉండాలని, ఆమె ఎప్పటికి హ్యాపీగా ఇలాగే కలిసి ఉండాలని అంటే..మరి కొంతమందేమో లవ్లీ కపుల్ అని కామెంట్ పెడుతున్నారు.
ఇంకొంతమందేమో సమంత అంటే పడని వారు సమంత నాగచైతన్య జీవితాన్ని బుగ్గిపాలు చేయడమే కాకుండా మరో అమ్మాయి జీవితాన్ని పిల్లల జీవితాన్ని కూడా నాశనం చేసింది అంటూ షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు. ఇలా సమంత ఏ చిన్న పోస్ట్ పెట్టిన సరే దానిపై నెగెటివిటీ విపరీతంగా వస్తుంది.అయితే రాజ్ నిడిమోరు మొదట శ్యామిలీ దే ని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప ఉందని తెలుస్తోంది. అయితే రాజ్ నిడిమోరు సమంతతో ప్రేమలో పడ్డాకే తన భార్యకు విడాకులు ఇచ్చారనే వార్తలు కూడా వినిపించాయి. అప్పటినుండి ఒంటరిగా పోరాడుతున్న శ్యామిలీ దే రాజ్ - సమంతల బంధం పై సోషల్ మీడియా వేదికగా ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేస్తోందని నెటిజన్స్ కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా వీరిద్దరి వివాహం తర్వాత శ్యామలీ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఒక నోటు పంచుకుంది..తనకి సపోర్ట్ చేసిన వారందరికీ కృతజ్ఞతలు అని.. నా మీద మీరు చూపిస్తున్న మద్దతుకి, ప్రేమకి నేను రిప్లై ఇవ్వనందుకు క్షమించాలి అంటూ ఓ పోస్ట్ పెట్టింది.అంతే కాదు చాలా రోజుల నుండి నిద్రలేని రాత్రులు గడుపుతూ.. తిరుగుతూ.. వాదించుకుంటూ వస్తున్నాను అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం సమంత - రాజ్ నిడిమోరులు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండగా.. శ్యామిలీ దే మాత్రం సోషల్ మీడియా వేదికగా తన బాధ అంతా పోస్టుల రూపంలో అభిమానులతో పంచుకుంటుంది.