సమంత భోజనం లేని రోజుల్ని చూసింది!
నేడు సమంత అగ్ర హీరోయిన్లలలో ఒకరు. కోట్లాది రూపాయలు పారితోషికం అందుకుంటుంది. సినిమాలు..సిరీస్ లు ..యాడ్స్ అంటూ రెండు చేతులా సంపాదనే.;
నేడు సమంత అగ్ర హీరోయిన్లలలో ఒకరు. కోట్లాది రూపాయలు పారితోషికం అందుకుంటుంది. సినిమాలు..సిరీస్ లు ..యాడ్స్ అంటూ రెండు చేతులా సంపాదనే. ఇది గాక బోలెడన్ని వ్యాపారలతో అదనంగా మరింత ఆదాయం అమ్మడి ఖాతాలో జమ అవుతుంది. సొంతగా చారిటీలు నిర్వహిస్తోంది. అనాధ బాలలకు, వృద్దులకు ఎంతో సహాయం చేస్తోంది. ఇక సమంత ప్రయివేట్ స్పేస్ లో ఎంతగా జీవితాన్ని ఆస్వాదిస్తుందో చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలో నచ్చిన ప్రదేశాలు తిరుగుతుంది. లగ్జరీ హోటల్స్ లో దిగుతుంది. ఖరీదైన జీవితాన్ని గడుపుతుంది. లక్షల రూపాయలు అందుకోసం వెచ్చిస్తుంది.
ఇదంతా ఇప్పుడు మరి సమంత గతం ఏంటి? అంటే తాను ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా జీవితాన్ని గడిపినట్లు ఎంతో ఓపెన్ గాచెప్పుకొచ్చింది సామ్. కెరీర్ ఆరంభంలో తన దగ్గర ఏదీ లేదని , కుటుంబం భోజనం చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడేదని గుర్తు చేసుకుంది. కానీ తొలి సినిమా రిలీజ్ అయిన అనంతరం తన జీవితం మొత్తం మారిపోయిందన్నారు. రాత్రికి రాత్రే తాను పెద్ద స్టార్ అవ్వడం తన జీవన శైలినే మార్చేసిందని తెలిపింది. డబ్బు, పేరు, కీర్తి అన్ని ఒకేసారి తన జీవితంలోకి వచ్చాయంది.
ఆ సమయంలో వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలో అర్దం కాక చాలా ఇబ్బంది పడినట్లు గుర్తు చేసుకుంది. అవే తనకుఓ లక్ష్యాన్ని గుర్తు చేసాయంది. అప్పటి నుంచి తన ప్రయాణంలో ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకున్నాయంది. నిజాయితీ అనేది కేవలం పెంపకం మీద మాత్రమే ఆధారపడి ఉంటుందన్నారు. దానికి దూరమైతే అస్తిరత్వం తప్పదన్నారు. తను స్టార్ అయిన తర్వాత ప్రతీది ప్రజల సమక్షంలోనే జరిగిందన్నారు. పెళ్లి చేసుకోవడం, విడిపోవడం, అనారోగ్యానికి గురి కావడం ఇవన్నీ ప్రజలకు తెలిసినవే. ఆ సమయంలో ఎన్నో విమర్శలు ఎదురైనప్పటికీ తానెప్పుడు నిజమైన జీవితాన్ని మాత్రమే గడిపానంది.
అలాగని అన్నింటా పరిపూర్ణరాలిని కాదు. తప్పులు చేయలేదు కాదని కాదు. కానీ ఉన్నంతలో వీలైనంత నిజాయితీగా ఉండటానికే ప్రయత్నించి ట్లుచెప్పుకొచ్చింది. ఆశ, ఆశయాలు ఎన్ని ఉన్నప్పటికీ దానికి మంచి ఉద్దేశం, బాధ్యత ఉండాలన్నారు. ప్రస్తుతం సమంత బాలీవుడ్ కెరీర్ పై దృష్టి పెట్టి పనిచేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వెబ్ సిరీస్ లతో పాటు సినిమా ప్రయత్నాలు సీరియస్ గా చేస్తోంది. ఓ కొత్త వ్యక్తిని తన జీవితంలోకి ఆహ్వానించినట్లు వార్తలొస్తున్నాయి.