మెగాఫోన్ పట్టబోతున్న స్టార్ హీరోయిన్?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా వివిధ అంశాలతో నిత్యం వార్తల్లో ఉంటూనే ఉంది.;
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా వివిధ అంశాలతో నిత్యం వార్తల్లో ఉంటూనే ఉంది. ఓసారి సినిమాలకు సంబంధించి వార్తల్లో నిలిస్తే మరోసారి వ్యక్తిగత అంశాల వల్ల వార్తల్లోకి ఎక్కుతుంది సమంత. ఇప్పటికే నటిగా మంచి స్టేటస్ ను దక్కించుకున్న సమంత రీసెంట్ గా నిర్మాతగా మారి శుభం అనే సినిమాతో మంచి సక్సెస్ ను అందుకుంది.
నటిగా, నిర్మాతగా..
ఓ వైపు నటిగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా, ఎంట్రప్రెన్యూర్ గా సమంత పలు రంగాల్లో రాణిస్తోంది. అయితే సమంత ఇప్పుడు ఇండస్ట్రీలో మరో కొత్త రోల్ ను ఎంచుకోబోతుందట. త్వరలోనే సమంత మెగాఫోన్ పట్టి డైరెక్టర్ గా మారనుందని, ఓ లవ్ స్టోరీతో సమంత డైరెక్టర్ గా మారడానికి రెడీ అవుతుందని, ఆల్రెడీ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కథను కూడా సమంత రెడీ చేసిందని అంటున్నారు.
కొత్త ఆర్టిస్టులతో సమంత డిస్కషన్స్
తాను రాసుకున్న కథను కొత్త టాలెంట్ తో తీయాలని, యంగ్ ఆర్టిస్టులతో సమంత డిస్కషన్స్ చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత, ఇప్పుడు డైరెక్టర్ గా కూడా అదే తరహా గుర్తింపు తెచ్చుకుని ఆడియన్స్ ను అలరించి, మెప్పించాలని ఎంతో కసిగా ఉందని అంటున్నారు.
సొంత బ్యానర్‌లోనే..
అయితే ఈ కథను కూడా సమంత తన సొంత బ్యానర్ లోనే తీయనుందని అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతన్నది పక్కన పెడితే ఈ వార్తలు సమంత ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం రక్త్ బ్రహాండ్, మా ఇంటి బంగారం సినిమాలు చేస్తున్న సమంత డైరెక్టర్ గా డెబ్యూ చేయాలన్నా కాస్త పట్టే అవకాశాలున్నాయి. హీరోయిన్ గా ఏ మాయ చేసావె లాంటి ప్రేమకథతో పరిచయమైన సమంత ఎలాంటి లవ్ స్టోరీతో డైరెక్టర్ గా డెబ్యూ చేయబోతుందో చూడాలి.