ఆ స్టార్ హీరో కొత్తగా ట్రై చేయడం ఉత్తమం!
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'సికిందర్' ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.;
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'సికిందర్' ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తొలి షోతోనే సినిమా పై ప్రేక్షకులు పెదవి విరిచేసారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవడంలో దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది. మురగదాస్ అద్భుతం ఏదో చేస్తాడనుకుంటే రొటీన్ సినిమా చేసి విమర్శలపాలయ్యాడు. ఈ నేపథ్యంలో వైఫల్యానికి ప్రధాన కారకుడిగా మురగదాస్ ని హైలైట్ చేస్తున్నారు.
అయితే ఈ వైఫల్యంలో సల్మాన్ ఖాన్ కి సగం షేర్ ఇవ్వాలి. ఇలాంటి రోటీన్ కథను ఆయన ఎలా అంగీకరించాడు? అని అంటున్నారు. సల్మాన్ ఖాన్ ఏమాత్రం అప్ డేట్ అవ్వకుండా ఇంకా ఓల్డ్ ఫార్మెట్ లోనే సినిమాలు చేస్తున్నాడని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మురగదాస్ ఓల్డ్ స్టోరీ చెప్పినా? సల్మాన్ ఖాన్ ఆ స్టోరీని ఆ మాత్రం కూడా ఎనాలసిస్ చేయకుండా చేయడం అన్నది సల్మాన్ తప్పిదంగా భావిస్తున్నారు.
సల్మాన్ ఇమేజ్ చట్రం దాటి వచ్చి సినిమాలు చేయడం లేదంటున్నారు. ఇతర హీరోలతో సల్మాన్ ఎందుకు అప్డేట్ కాలేకపోతున్నాడని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురుస్తుంది. సల్మాన్ ఖాన్ ఇకపై బిగ్ బాస్ షోలో చేయడం మానేసి మంచి కథలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. బిగ్ బాస్...హౌస్ లో ఉన్న పాత్రల నుంచి ఖాన్ సాబ్ బయటకు రాలేకపోతున్నాడని...బిగ్ బాస్ హోస్టింగ్ బాధ్యతల నుంచి తప్పుకుంటే తప్ప సాధ్యం కాదని సూచిస్తున్నారు.
సల్మాన్ ఖాన్ కొంత కాలంగా పూర్తి యాక్షన్ స్టోరీలనే మీదన ఏ దృష్టి పెడుతున్నాడని...కమర్శియల్ యాస్పెక్ట్ లో సినిమాలు చేస్తున్నాడు? తప్ప ఆయన ఎంపిక చేసుకున్న కథల్లో ఎమోషన్ మిస్ అవుతుందని అంటున్నారు. `సికిందర్` ఫెయిల్ అవ్వడానికి అలాంటి ఎమోషన్ మిస్ అవ్వడం ఓ కారణంగా హైలైట్ చేస్తున్నారు. ఏది ఏమైనా సల్మాన్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాల్సిన పరిస్థితులైతే ఏర్పడ్డాయి.