• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వరుస ప్లాప్స్‌ పడ్డా...

వరుస ప్లాప్స్‌ పడ్డా స్టార్‌ హీరో అదే మూస దోరణి..!

| తాజాగా సికిందర్ సినిమాతో సల్మాన్ ఖాన్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దశాబ్దం క్రితం రావాల్సిన సినిమా అంటూ చాలా మంది పెదవి విరుస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2025-05-31 06:00 GMT

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ సూపర్‌ హిట్‌ దక్కించుకుని చాలా కాలం అయింది. గత దశాబ్ద కాలంగా ఈయన నటించిన సినిమాలు చాలానే వచ్చాయి. అందులో హిట్‌ ఎన్ని అంటే ఠక్కున చెప్పలేని పరిస్థితి. బాలీవుడ్‌లో యంగ్‌ హీరోలు వరుస విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉంటే సల్మాన్‌ ఖాన్‌ మాత్రం ఎప్పటికప్పుడు నిరాశ పరుస్తూ వస్తున్నాడు. తాజాగా సికిందర్ సినిమాతో సల్మాన్ ఖాన్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దశాబ్దం క్రితం రావాల్సిన సినిమా అంటూ చాలా మంది పెదవి విరుస్తున్నారు. బాక్సాఫీస్‌ వద్ద సికిందర్‌ మిగిల్చిన నష్టంను లెక్కలు వేయడానికి చాలా సమయం పట్టింది.

సికిందర్‌ ఫలితంతో సంబంధం లేకుండా సల్మాన్‌ ఖాన్‌ మరో సినిమాకు ఓకే చెప్పాడు. తెలంగాణకు చెందిన దివంగత కల్నల్‌ సంతోష్‌ బాబు పాత్రలో సల్మాన్‌ ఖాన్‌ నటించబోతున్నాడు. జులై నెలలో షూటింగ్‌ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాను 2026 ఈద్‌ కి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. 2020లో గల్వాన్‌ వ్యాలీలో చైనా దళాలతో జరిగిన ఘర్షణలో సంతోష్‌ బాబు మృతి చెందిన విషయం తెల్సిందే. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను రూపొందించేందుకు గాను స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన అనుమతులు అన్నీ తీసుకున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లడం ఆలస్యం.

ఆ బయోపిక్‌ ఇంకా షూటింగ్‌ ప్రారంభం కాకముందే సల్మాన్‌ ఖాన్‌ మరో సినిమాకు ఓకే చెప్పాడు. బాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మలయాళ దర్శకుడు మహేష్‌ నారాయణన్‌ దర్శకత్వంలో సల్మాన్‌ సినిమా ఉండబోతుంది. ఇటీవల వీరిద్దరి మధ్య ప్రాథమిక చర్చలు జరిగాయి. కథ విషయమై వీరిద్దరు చర్చించారు. స్టోరీ లైన్‌కి సల్మాన్‌ ఓకే చెప్పాడు. కథ, కాన్సెప్ట్‌ నచ్చడంతో తన టీంను మహేష్‌ నారాయణన్‌తో కలిసి స్క్రిప్ట్‌ వర్క్ మొదలు పెట్టమని సూచించాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి కావడం ఖాయం. వచ్చే నెలలోనే సినిమా గురించి మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే కన్ఫర్మ్‌ చేసిన సంతోష్ బాబు బయోపిక్‌, ప్రస్తుతం చర్చల దశలో ఉన్న మహేష్‌ నారాయణన్‌ సినిమా విషయంలో అభిమానులు పెదవి విరుస్తున్నారు. వరుసగా ఫ్లాప్స్ పడుతున్నా కూడా సల్మాన్‌ ఖాన్‌ అదే జోనర్‌ ను ఫాలో అవుతున్నాడు, మూస దోరణిలో సినిమాలు చేస్తున్నాడు తప్ప కొత్తగా ఏమైనా ప్రయత్నిద్దాం అనే ఉద్దేశం కనిపించడం లేదు అంటూ అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి సికిందర్‌ తరహా ఫలితాలు తప్పవేమో అని అప్పుడే అభిమానులు పెదవి విరుస్తున్నారు. ఈ విషయమై సల్మాన్‌ ఖాన్‌ మాత్రం చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు తనకు సక్సెస్ తెచ్చి పెడుతాయని నమ్ముతున్నాడు. మరి ఆయన నమ్మకం నిలిచేనా అనేది చూడాలి.

Tags:    
  • SalmanKhan 
  • Sikandar 
  • BollywoodFlops 
  • SantoshBabuBiopic 
  • MaheshNarayanan 
  • BollywoodNews 
  • SalmanNextMovie 
  • Eid2026Release 
  • SalmanKhanFans 
  • Filmindustry 

Similar News

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Copyright @2026

Powered by Blink CMS