సల్మాన్‌ఖాన్ వాచ్ కలెక్షన్..వాటి వాల్యూ ఎంతంటే..!
అయితే సల్మాన్ ఖాన్ వాచ్ కలెక్షన్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సల్మాన్ ఖాన్ నికర ఆసక్తికి సంబంధించిన వార్త కూడా ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.;
సల్మాన్ ఖాన్ గత కొంత కాలంగా తన మార్కు సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించలేకపోతున్నాడు. యష్ రాజ్ స్పై యూనివర్స్‌లో చేసిన `టైగర్ 3`, కిసీకీ భాయ్ కిసీకీ జాన్, ఏ.ఆర్. మురుగదాస్ డైరెక్షన్‌లో చేసి `సికిందర్` వరుసగా ఫ్లాప్ కావడంతో సల్లూభాయ్ కెరీర్ ప్రస్తుతం ప్రశ్నార్థకంలో పడింది.
ప్లాప్‌ల నుంచి బయటపడటం కోసం సల్మాన్ ఖాన్ ఎంచుకున్న మూవీ `గాల్వాన్`. గాల్వాన్ లోయలో చైనా సైనికులకు, మన సైనికులకు మధ్య జరిగిన సివిల్ వార్ కారణంగా మన సైనికులు చాలా మంది చనిపోయారు.
చైనా సైనికులు కూడా అత్యధిక శాతం మృత్యువాత పడ్డారు. అయితే ఈ వార్‌లో వీరోచితంగా పోరాడిన ఓ సోల్జర్ స్టోరీతో `గాల్వాన్`ని తెరకెక్కిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ని `జింజీర్` ఫేమ్ అపూర్వ లాఖియా తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్న సల్మాన్ ఖాన్ ఈ క్యారెక్టర్ కోసం మరింతగా బరువు తగ్గబోతున్నారు. ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ కాస్ట్‌లీ వాచ్ కలెక్షన్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రతి స్టార్‌కు ఓ కాస్ట్‌లీ వాచ్ సెంటిమెంట్‌గా మారిన విషయం తెలిసిందే.
అయితే సల్మాన్ ఖాన్ వాచ్ కలెక్షన్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సల్మాన్ ఖాన్ నికర ఆసక్తికి సంబంధించిన వార్త కూడా ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆయన ఆసక్తి విలువ అక్షరాలా రూ.2,900 కోట్లు అని ఇందులో కాస్ట్‌లీ వాచ్‌ల కలెక్షన్ మొత్తం తెలిస్తే షాక్ అవుతారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సల్మాన్ ఖాన్‌కు పదిహేను రకాల కాస్ట్‌లీ వాచ్‌లున్నాయి. అవి రిచర్డ్ మిల్, రోలెక్స్, జాకబ్ అండ్ కో, ఆడిమర్స్ పీగట్, పాటెక్ ఫిలిప్.
ఈ వాచ్ కలెక్షన్ మొత్తం ఖరీదు ఇప్పుడు అభిమానుల్ని షాక్‌కు గురి చేస్తోంది. దీనికి సంబంధించిన ఓ పోస్ట్ నెట్టింట ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వాచ్‌ల మొత్తం వాల్యూ అక్షరాలా రూ.140 కోట్లు. ఈ వాచ్ కలెక్షన్‌లో రూ.36.6 లక్షల వాచ్ నుంచి రూ.42 కోట్ల ఖరీదైన పాటెక్ ఫిలిప్ మోడల్ లోని లూసీ రెయిన్ బో వాచ్ వరకు 15 కాస్ట్‌లీ వాచ్‌లు ఉన్నాయి.