ఇదేం పద్ధతి... బిగ్‌బాస్ హోస్ట్‌పై ట్రోల్స్‌

దేశవ్యాప్తంగా ప్రస్తుతం బిగ్‌బాస్‌ గురించి చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే.

Update: 2026-10-05 05:56 GMT

దేశవ్యాప్తంగా ప్రస్తుతం బిగ్‌బాస్‌ గురించి చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. ఒక వైపు హిందీ బిగ్‌బాస్ సీజన్‌ 20 నడుస్తూ ఉంటే మరో వైపు తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ బిగ్‌బాస్ కొత్త సీజన్‌లు సైతం నడుస్తున్నాయి. ప్రతి భాషలోనూ బిగ్‌బాస్ షో సూపర్‌ హిట్‌గా నడుస్తోంది. అన్ని భాషల ప్రేక్షకులు బిగ్‌బాస్ కొత్త సీజన్‌లకు బ్రహ్మరథం పడుతున్నారు. అదే సమయంలో షో పై సోషల్‌ మీడియాలో ఎప్పటిలాగే తీవ్రమైన విమర్శలు, హోస్ట్‌లకు వ్యతిరేకంగా ట్రెండ్‌ కనిపిస్తూ ఉంది. అయితే ఈసారి హిందీ బిగ్‌బాస్ ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. ప్రధానంగా బిగ్‌బాస్‌ హిందీ హోస్ట్‌ సల్మాన్‌ ఖాన్‌ తీరు పై ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హోస్ట్‌ సల్మాన్‌ ఖాన్‌ కొంతమంది కంటెస్టెంట్స్ విషయంలో ఫెవరేట్‌గా వ్యవహరిస్తున్నారు అంటూ సోషల్‌ మీడియాలో హిందీ బిగ్‌బాస్ ప్రేక్షకులు ఆరోపణలు చేస్తున్నారు.

సల్మాన్‌ ఖాన్‌ బిగ్‌బాస్ 20...

సల్మాన్‌ ఖాన్‌ ఇప్పటి వరకు 17 సీజన్‌ల బిగ్‌బాస్‌ షో కి హోస్టింగ్‌ చేశాడు. సల్మాన్‌ ఖాన్‌ ఒకానొక సమయంలో కంటెస్టెంట్స్ ను గడగడలాడిస్తూ షో ను రన్‌ చేసిన విషయం తెల్సిందే. వీకెండ్‌ ఎపిసోడ్స్ కోసం హిందీ బిగ్‌బాస్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదని ఆ ప్రేక్షకులే అంటున్నారు. సల్మాన్‌ ఖాన్‌ లో ఫైర్‌ తగ్గిందా అంటూ చాలా మంది గత రెండు మూడు వారాలుగా ప్రసారం అవుతున్న వీకెండ్‌ ఎపిసోడ్స్ చూస్తే అనిపించక మానదు. అందుకు కారణం ఏంటంటే వీకెండ్‌ ఎపిసోడ్స్ లో సల్మాన్‌ ఖాన్‌ హోస్టింగ్‌ ప్రేక్షకులు అనుకున్న దానికి ఏమాత్రం మ్యాచ్ కావడం లేదు. వీక్‌ డేస్ లో హౌస్‌ లో తప్పు చేసిన వారిని వీకెండ్‌ ఎపిసోడ్‌లో సల్మాన్‌ ఖాన్‌ ఉతికి ఆరేస్తాడని అంతా భావిస్తున్నారు. కానీ కొందరి విషయంలో సల్మాన్‌ ఖాన్‌ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నాడు అంటూ తాజా ఎపిసోడ్‌లోని కొన్ని సంఘటలు తీసుకుని సాక్ష్యాలతో సహా ఎక్స్‌ లో షేర్‌ చేస్తున్నారు.

మహి విజి పట్ల సల్మాన్‌ పాజిటివ్‌...

ముఖ్యంగా మహి విజి పట్ల సల్మాన్‌ చాలా ఫేవరెట్‌గా ఉంటున్నాడు అనే విమర్శలు వస్తున్నాయి. ఆమె వ్యవహరిస్తున్న తీరుకు ప్రేక్షకులు విసిగి పోయారు. హౌస్‌లో ఉన్న ప్రతి ఒక్కరు ఆమెపై అసహనంతోనే ఉన్నారు. అయినా కూడా హిందీ బిగ్‌బాస్ టీం ఆమెను కాపాడటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సల్మాన్‌ సైతం ఆమె తీరును తప్పుపట్టకుండా చూసి చూడనట్లుగా వెళ్లడం ఏంటో అని చాలా మంది విమర్శలు చేస్తున్నారు. సల్మాన్‌ ఖాన్‌ కచ్చితంగా ఆమెకు పాజిటివ్‌గా ఉన్నాడు, బిగ్‌బాస్ టీం మొత్తం ఆమె వెనుక ఉందా అన్నట్లుగా అనిపిస్తుందని, ఆమె ఎన్ని తప్పులు చేసినా కూడా ఎందుకు చూసి చూడనట్లుగా సల్మాన్‌ వదిలేస్తున్నాడు అనే విషయాన్ని చెప్పాలి అంటూ సోషల్‌ మీడియాలో ఆమె వ్యతిరేకులు, బిగ్‌బాస్‌ ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. సల్మాన్‌ దీనికి సమాధానం చెప్పాల్సి ఉంది.

బిగ్‌బాస్‌ హౌస్‌లో గొడవలు...

బిగ్‌బాస్‌ సీజన్‌ 20 గతంతో పోల్చితే రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ కసి మీద ఉన్నారు. వారి కసి వల్ల ఆట బాగుంటుంది. అయితే ఆ కసితో కొందరు తప్పులు చేయడం జరుగుతుంది. ఆ తప్పులను వీకెండ్‌ కా వార్‌ ఎపిసోడ్స్‌ లో సల్మాన్‌ఖాన్‌ సరి చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా వారిని మందలించి మిగిలిన వారు మళ్లీ తప్పులు చేయకుండా కూడా చూడాలి. కానీ సల్మాన్‌ ఖాన్‌ ఎక్కువగా సీరియస్ కావడం లేదు. లైట్‌గానే వ్యవహరిస్తున్నాడు. గతంలో ఉన్న ఫైర్ సల్మాన్‌ ఖాన్‌ లో కనిపించడం లేదు.

ఎంత పెద్ద తప్పు చేసినా చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలేయడం ఏంటో అంటూ బిగ్‌బాస్ ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. బిగ్‌బాస్ టీం వారు ఆయన్ను ఇలా మార్చారా లేదంటే సల్మాన్‌ ఖాన్‌ నిజంగానే కొందరి పట్ల పాజిటివ్‌ వైకరి, మెతక వైకరితో ఉన్నాడా అనేది తెలియాల్సి ఉంది. ముందు ముందు ఎపిసోడ్స్ కూడా ఇలాగే ఉంటే ప్రేక్షకులు మరింతగా విమర్శలు చేయడం ఖాయం, అప్పుడు షో రేటింగ్‌ పైనే ప్రభావం పడుతుంది. మరి నిర్వాహకులు ఈ సమయంలో ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News