AI వీడియో కాంట్రవర్సీ.. జాన్వీ రియాక్షన్ ఇదే..
ఏఐతో అద్భుతాలు చేయొచ్చు. కానీ.. ఎదుటివారి రెస్పెక్ట్ ను దెబ్బతీసేలా వాడితే మాత్రం సమస్యే. ఇప్పుడు ఇదే విషయంపై బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ స్ట్రాంగ్ గా రెస్పాండ్ అయ్యారు.
ఏఐతో అద్భుతాలు చేయొచ్చు. కానీ.. ఎదుటివారి రెస్పెక్ట్ ను దెబ్బతీసేలా వాడితే మాత్రం సమస్యే. ఇప్పుడు ఇదే విషయంపై బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ స్ట్రాంగ్ గా రెస్పాండ్ అయ్యారు. దేవర సినిమాలోని చుట్టమల్లె సాంగ్ లో ఆమె కనిపించిన సీన్స్ ను కొందరు ఏఐతో మార్చారు. అసభ్యకరంగా రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ ఘటనపై జాన్వీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన పర్మిషన్ లేకుండా ఇలాంటి కంటెంట్ ను క్రియేట్ చేయడం, వైరల్ చేయడం సరికాదన్నారు.
జాన్వీ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఆ విషయాన్ని ప్రస్తావించారు. మహిళలను ఒక వస్తువులా చూపించేందుకు టెక్నాలజీని యూజ్ చేయకూడదన్నారు. మహిళల పర్మిషన్ లేకుండా ఫేక్ కంటెంట్ ను క్రియేట్ చేసి వైరల్ చేయడం తప్పు అని చెప్పారు. ఇది దాదాపు లైంగిక దాడితో సమానమని పేర్కొన్నారు. మహిళ విషయంలో పర్మిషన్ చాలా ముఖ్యమని జాన్వీ క్లారిటీ ఇచ్చారు.
ఒక మహిళ ఐదు రోజులు అవును అని చెప్పినా.. ఆరో రోజు వద్దు అంటే ఆ మాటను గౌరవించాల్సిందేనన్నారు. అంతకంటే సింపుల్ విషయం మరొకటి లేదని చెప్పారు. ఒక మహిళ పొట్టి డ్రెస్సులు వేసుకుంటే.. ఆమెను ఎలా పడితే అలా షూట్ చేయవచ్చని అర్థం కాదన్నారు. ఆమె డ్రెస్సింగ్ ఎలా ఉన్నా.. తన శరీరంపై నిర్ణయం తీసుకునే హక్కు ఆమెకే ఉంటుందని చెప్పారు. ఎవరిని ఎంతవరకు అనుమతించాలి? ఎక్కడ లిమిట్ పెట్టాలి? అనేది ఆమె నిర్ణయమేనన్నారు.
మహిళలు బయట ఎదుర్కొంటున్న సమస్యలు ఇప్పుడు డిజిటల్ వరల్డ్ లో కూడా కనిపిస్తున్నాయని జాన్వీ అన్నారు. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం మాత్రమే సొల్యూషన్ కాదన్నారు. ఇతరుల లిమిట్స్ కు రెస్పెక్ట్ ఇచ్చే ఆలోచన మారాలని చెప్పారు. తప్పు ఏదో.. ఒప్పు ఏదో చిన్నప్పటి నుంచే అర్థం చేసుకునేలా చేయాలని సూచించారు. ఎదుటివారి పర్సనల్ లిమిట్స్ కు రెస్పెక్ట్ ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని క్లారిటీ ఇచ్చారు.
వీడియోపై ఇప్పటికే రెస్పాండ్ అయిన జూనియర్ ఎన్టీఆర్ కు జాన్వీ స్పెషల్ థ్యాంక్స్ తెలిపారు. తనకు నేరుగా సంబంధం లేని ఒక మహిళా సమస్యపై ఎన్టీఆర్ స్ట్రాంగ్ గా మాట్లాడటం ఎంతో ధైర్యం ఇచ్చిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న మహిళలకు ఆయన స్పందన భరోసా ఇస్తుందని చెప్పిన ఆమె, చిరంజీవి, విజయ్, ఖుష్బూకు కూడా జాన్వీ థ్యాంక్స్ చెప్పారు. మహిళల గౌరవానికి సంబంధించిన ఇలాంటి అంశాలపై అందరూ రెస్పాండ్ అవ్వాలని కోరారు.
మరోవైపు జాన్వీ కపూర్ కు సంబంధించిన ఏఐ మార్ఫ్ వీడియోపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. పర్మిషన్ లేకుండా మహిళల ఫోటోలు, వీడియోలు మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. అయితే జాన్వీ వీడియో ఇన్సిడెంట్ తర్వాత ఏఐ టెక్నాలజీ వినియోగంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టెక్నాలజీని బాధ్యతగా ఉపయోగించాలని నెటిజన్లు కోరుతున్నారు.