అప్ కమింగ్ మూవీస్.. అసలు నాగవంశీ ప్లాన్ ఏంటి?
ఒక సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడం.. ఆ తర్వాత మార్చడం.. మళ్లీ కొత్త డేట్ చెప్పడం.. ఇదంతా ఇప్పుడు టాలీవుడ్ లో కామన్ గా మారిపోయింది.
ఒక సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడం.. ఆ తర్వాత మార్చడం.. మళ్లీ కొత్త డేట్ చెప్పడం.. ఇదంతా ఇప్పుడు టాలీవుడ్ లో కామన్ గా మారిపోయింది. కానీ ఒకే నిర్మాత నుంచి వరుసగా డేట్లు మారుతూ వస్తే మాత్రం డిబేట్ మొదలవుతుంది. ఇప్పుడు నిర్మాత నాగవంశీ ప్లానింగ్ పై అదే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఆదర్శ కుటుంబం మూవీ రిలీజ్ విషయంలో ఆయన నిర్ణయాలపై చర్చ జరుగుతోంది. .
విక్టరీ వెంకటేష్ లీడ్ రోల్ లో తెరకెక్కిన ఆదర్శ కుటుంబం మూవీ ముందు అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే సినిమా పనులు పూర్తి కాకపోవడంతో అక్టోబర్ 9కి వాయిదా వేశారు. ఆ డేట్ కూడా మారే అవకాశం ఉందనే ప్రచారం మొదలైంది. నెల లాస్ట్ కు వెళ్లే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. దీనిపై నాగవంశీ నిర్వహించే ప్రెస్ మీట్ లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. నాగవంశీ నిర్మాణ సంస్థ నుంచి రాబోయే సినిమాల డేట్లు కూడా ఇప్పటికే మారాయి. కొన్ని రోజుల క్రితం ఆదర్శ కుటుంబంకు అక్టోబర్ 2 డేట్, ఎమో ఎమో ఇదికి దసరా సీజన్ డేట్ అనుకున్నారు. తర్వాత ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2కు, వీసా అక్టోబర్ 17కి వెళ్ళాయి. ఆ తర్వాత ఆదర్శ కుటుంబం అక్టోబర్ 9కి, ఎమో ఎమో ఇది అక్టోబర్ 30కి మారాయి.
ఇప్పుడు ఆదర్శ కుటుంబం మరోసారి వాయిదా పడితే.. అక్టోబర్ 30కి వెళ్లే అవకాశాలపై రూమర్లు వినిపిస్తున్నాయి. అదే జరిగితే మిగిలిన సినిమాల డేట్లు కూడా మారాల్సి రావచ్చు. అంటే ఒక్క సినిమా రిలీజ్ డేట్ ఛేంజ్.. దాని వెనుక ఉన్న మరో రెండు, మూడు సినిమాల షెడ్యూల్ పై ఎఫెక్ట్ చూపించే పరిస్థితి ఉంటుంది. నిర్మాత నాగవంశీ గతంలో కూడా సినిమా అనుకున్న తేదీకే రావాలనే రూల్ ను తాను తీసేశానని, పరిస్థితిని బట్టి రిలీజ్ డేట్ మార్చుకుంటానని చెప్పిన సందర్భం ఉంది.
అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రేక్షకులతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్లు, ఇతర సినిమాల నిర్మాతల ప్లానింగ్ కూడా లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు, భారీ కాంబినేషన్ల సినిమాలు నిర్మిస్తున్నప్పుడు రిలీజ్ డేట్ విషయంలో మరింత క్లారిటీ అవసరం. సినిమా ఎప్పుడు వస్తుందనే విషయంలో చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగితే.. అదే సమయంలో రిలీజ్ కు సిద్ధమవుతున్న చిన్న, మీడియం సినిమాలు కూడా తమ ప్లానింగ్ మార్చుకోవాల్సి వస్తుంది.
ఇక నాగవంశీ చేతిలో ఇప్పుడు ఒకటి కాదు.. వరుస సినిమాల రిలీజ్ డేట్లు ఉన్నాయి. ఒక డేట్ మారితే దాని ఎఫెక్ట్ మరో సినిమాపై పడే పరిస్థితి ఉంది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి నాగవంశీ ప్రకటించే కొత్త షెడ్యూల్ పైనే ఉంది. అసలు ఆయన ప్లాన్ ఏంటి, ఆదర్శ కుటుంబం అనుకున్న తేదీకే వస్తుందా, లేక మరోసారి వాయిదా పడుతుందా అనేది తెలియాల్సి ఉంది.