బాక్సాఫీస్ క్లాసిక్ వెనుక ఇంట్రెస్టింగ్ కథ!

భన్సాలీకి తన సినిమాలపై ఎంతటి పట్టు ఉన్నా? సల్మాన్ ఖాన్ మాస్ పల్స్ ..బాక్సాఫీస్ జడ్జ్‌మెంట్‌పై ఆయనకు అపారమైన నమ్మకం ఉంది.

Update: 2026-06-06 17:30 GMT

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దృశ్యకావ్యాలకు.. ఆయ‌న చిత్రాల్లో ఉండే అద్భుతమైన పాటలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్- దీపికా పదుకొణె కాంబినేషన్‌లో వచ్చిన `గోలియోన్ కీ రాస్లీలా రామ్-లీలా` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో? తెలిసిందే. అయితే ఈ సినిమా నిర్మాణంలో భాగంగా తెరవెనుక జరిగిన కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు, చిత్రాల ఎంపికలో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ చూపించిన ప్రమేయం గురించి తాజాగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సంజయ్ లీలా భన్సాలీ - సల్మాన్ ఖాన్‌ల మధ్య దశాబ్దాల కాలంగా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. 'ది మ్యూజికల్`, `హమ్ దిల్ దే చుకే సనమ్` వంటి క్లాసిక్ చిత్రాల తర్వాత వారిద్దరి మధ్య వృత్తిపరమైన గౌరవంతో పాటు వ్యక్తిగత స్నేహం కూడా బలపడింది. భన్సాలీ కథలు రాసుకునేటప్పుడు .. పాటల కంపోజిషన్ చేసేటప్పుడు తరచుగా సల్మాన్ ఖాన్‌తో చర్చలు జరుపుతుంటారు. ఈ క్రమంలోనే `రామ్-లీలా` సినిమాకు సంబంధించిన ప్రత్యేకమైన పాట విషయంలో సల్మాన్ ఇచ్చిన సలహా ఆ పాటనే స్క్రాప్ చేసేలా చేసింది.

చిత్ర యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం `రామ్-లీలా` స్క్రిప్ట్ వర్క్ .. మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్న సమయంలో భన్సాలీ విభిన్నమైన ట్యూన్‌ను, దానికి తగ్గ సాహిత్యాన్ని సిద్ధం చేశారు. ఆ పాటను ఆయన సల్మాన్ ఖాన్‌కు వినిపించినప్పుడు సల్మాన్ దానికి పూర్తి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఆ పాటలోని కొన్ని లైన్లు .. దాని వెనుక ఉన్న కాన్సెప్ట్ సినిమా ప్రధాన కథాంశానికి, పాత్రల తీవ్రతకు సరిపోలడం లేదని ఇది ప్రేక్షకుల మూడ్‌ను దెబ్బతీసే అవకాశం ఉందని సల్మాన్ ఖాన్ భన్సాలీకి వివరించారు.

భన్సాలీకి తన సినిమాలపై ఎంతటి పట్టు ఉన్నా? సల్మాన్ ఖాన్ మాస్ పల్స్ ..బాక్సాఫీస్ జడ్జ్‌మెంట్‌పై ఆయనకు అపారమైన నమ్మకం ఉంది. ఆ పాట ఎంత బాగున్నప్పటికీ అది సినిమా గమనానికి అడ్డుపడుతుందని సల్మాన్ గట్టిగా చెప్పడంతో భన్సాలీ ఆ పాటను సినిమా నుండి పూర్తిగా తొలగించడానికి అంగీకరించారు. ఒక రకంగా సల్మాన్ ఖాన్ చేసిన బలవంతం సలహా వల్లే భన్సాలీ ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందిట‌. ఆ తర్వాత ఆ స్థానంలో మరింత మెరుగైన ఎమోషనల్ సాంగ్‌ను రీప్లేస్ చేశారు.

ఈ పరిణామం బాలీవుడ్‌లో దర్శకులకు ..స్టార్ హీరోలకు మధ్య ఉండే అంతర్గత సృజనాత్మక బంధాన్ని తెలియజేస్తుంది. తాము కలిసి సినిమా చేయకపోయినప్పటికీ తోటి దర్శకుడి ప్రాజెక్ట్ పర్ఫెక్ట్‌గా రావాలనే ఉద్దేశంతో సల్మాన్ ఖాన్ విలువైన ఇన్‌పుట్స్‌ను అందించడం విశేషం. బహుశా ఆ పాట కనుక సినిమాలో ఉండి ఉంటే `రామ్-లీలా` సాధించిన క్లాసిక్ స్టేటస్‌పై ఎలాంటి ప్రభావం పడేదోననే చర్చ కూడా తాజాగా సినీ విశ్లేషకుల్లో సాగుతోంది.

Tags:    

Similar News