90 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే!
చిరు ధాన్యాలతో కూడిన అన్నాన్నే వండుకుంటారుట. కొన్ని సంవత్సరాలుగా ఇదే విధానంలో ఆహారం తీసుకో వడంతో శరీరానికి అలా అలవాటుగా మారింది.;
బాలీవుడ్ రైటర్, సల్మాన్ ఖాన్ తండ్రి సలీంఖాన్ ఎంత పిట్ గా ఉంటారన్నది చెప్పాల్సిన పనిలేదు. 90 ఏళ్ల వయసులోనూ సలీంఖాన్ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. మరి ఈ రకమైన ఆరోగ్యానికి కారణం ఏంటి? ఆయన డైట్ సీక్రెట్ ఏంటి? అంటే చాలా విషయాలే ఉన్నాయి. ఈ విషయంలో ఆయన పాటించేది ఆధునికమైన ఫిట్ నెస్ ట్రెండ్స్ కాదు. జిమ్ కు వెళ్లరు. వర్కౌట్లు చేయరు. డైట్ పాటించరు. మరి ఎలా సాధ్యమంటే? దశాబ్దాలగా పాటిస్తోన్న జీవన విధానమేనని తెలుస్తోంది. క్రమశిక్షణతో కూడిన జీవన శైలే ఆయన ఆరోగ్య రహస్యంగా చెప్పొచ్చు.
ఇప్పటికీ రైస్ వాడకంలో:
సలీంఖాన్ ఇప్పటికీ కూడా రెండు పూటలా భోజనం చేస్తారుట. భోజనంలో తప్పకుండా రెండు..మూడు పరోటాలు ఉండాలి. దాంతో పాటు కడుపునిండా రైస్ తీసుకుంటారు. అందులోకి నాన్ వెజ్ వంటకాలు తప్పనిసరి. ఆ రెండు పనులు పూర్తయిన తర్వాత డెజర్ట్ తీసుకుంటారు. ఇంత తింటే ఆరోగ్యం ఏంటి? అనారోగ్యం కదా? అని చాలా మం దికి సందేహం వస్తుంది. డాక్టర్లు అంతా రైస్ మానేయాలి. హై కార్పోహైడ్రేట్స్ ఉంటాయి? అవి తీసుకుంటే షుగర్ వ్యాది తప్పదు అంటారు. కానీ సలీంఖాన్ వైట్ రైస్ కంటే ఎక్కువగా బ్రౌన్ రైస్ తీసుకుంటారు.
వ్యాయామం పాత పద్దతిలోనే:
చిరు ధాన్యాలతో కూడిన అన్నాన్నే వండుకుంటారుట. కొన్ని సంవత్సరాలుగా ఇదే విధానంలో ఆహారం తీసుకో వడంతో శరీరానికి అలా అలవాటుగా మారింది. అందుకే ఇంత వయసు వచ్చినా? ఇప్పటికీ అదే పద్దతిలో ఆహారం తీసుకుంటారుట. వయసు రీత్యా ఆకలి తగ్గినా? ఇదే సాంప్రదాయ లో ఆహారం క్రమం తప్పకుండా తీసుకుం టారుట. తినడంలోనే కాదు వ్యాయామంలో కూడా పాత పద్దతినే అనుసరిస్తున్నారు. ప్రతీ రోజు క్రమం తప్పకుండా ముంబైలోని బస్ స్టాండ్ ప్రాంతంలో వాకింగ్ చేస్తారుట. అప్పుడప్పుడు గ్రౌండ్ కి వెళ్తుంటారుట. రెండు పూటలా వాకింగ్ కి తప్పనిసరి.
తనయుడి మాట వినని డాడ్:
వాకింగ్ మధ్యలో రన్నింగ్ చేస్తారుట. కొన్ని దశాబ్దాలుగా ఉన్న అలవాటు ఇది. అందుకే ఇప్పటికీ పాత పద్దతిలోనే కొనసాగుతున్నారు. ఆధునిక వ్యాయామ పద్దతులు అందుబాటులో ఉన్నా? వాటి జోలికి వెళ్లరు. సల్మాన్ ఖాన్ చాలా సార్లు వాకింగ్ వద్దు అని ఇంట్లోనే థ్రెడ్ మిల్లు మీద వాకింగ్ చేయమని చెప్పినా మాట వినరుట. ఉదయాన్నే షార్ట్ ..టీషర్ట్ ..షూట్ ధరించి ఇంటి నుంచి నడుచుకుంటూనే వెళ్లిపోతారుట. ఇంటికి తిరిగి వచ్చే సరికి రెండు..మూడు గంటలు సమయం పడుతుందిట.