సలార్-2 రిలీజ్ డేట్ కూడా ఫిక్సా?

సినిమాలో ప్రభాస్ కు ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్లకు ఆయన ఫ్యాన్స్ ఊగిపోయారు.

Update: 2024-05-02 16:21 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్‌: పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సినిమాలో ప్రభాస్ కు ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్లకు ఆయన ఫ్యాన్స్ ఊగిపోయారు.

ఇక ఈ సినిమాకు సీక్వెెల్ గా సలార్‌: శౌర్యాంగ పర్వం ఉంటుందని మూవీ చివర్లో ప్రకటించారు మేకర్స్. దీంతో రెండో పార్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎంతగానో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయినట్లు అప్డేట్ రావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. మే నెల చివర్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రశాంత్ నీల్ పూర్తిగా దృష్టి పెట్టారని టాక్.

అయితే ఫస్ట్ పార్ట్ భారీ విజయం అందుకున్న నేపథ్యంలో ప్రశాంత్ నీల్.. మొదట అనుకున్న స్క్రిప్ట్ కు కాస్త మెరుగులు దిద్దారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్ ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. మే చివరి వారం నుంచి పది రోజుల పాటు జరిగే షెడ్యూల్ లో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొంటారని సమాచారం. అక్టోబర్ కల్లా ఈ సినిమా షూట్ కంప్లీట్ చేయాలని మేకర్స్ రీసెంట్ గా టార్గెట్ పెట్టుకున్నట్లు వినికిడి.

Read more!

అంతే కాకుండా.. ఈ మూవీని డిసెంబర్ లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. సీక్వెల్ లో ఖాన్సార్‌ కుర్చీ కోసం జరిగే రాజకీయాలు, మలుపులు, యాక్షన్‌ ఫస్ట్ పార్ట్ కు మించి ఉంటాయని సమాచారం. ఆడియన్స్ మరోసారి సరికొత్త ప్రపంచాన్ని ఆస్వాదిస్తారని టాక్. శ్రుతి హాసన్‌, జగపతి బాబు, బాబీసింహా, శ్రియారెడ్డి, బ్రహ్మాజీ, షఫీ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు.

ఇక ఈ సినిమా కోసం హీరో ప్రభాస్ బల్క్ డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయనకు ఉన్న వేరే మూవీ కమిట్మెంట్స్ వల్ల ఈ సినిమాలోని ఆయన పార్ట్ కు సంబంధించిన సన్నివేశాలను ముందుగా కంప్లీట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అందుకోసం ఇప్పటికే ప్రభాస్, ప్రశాంత్ నీల్ డిస్కస్ కూడా చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.

Tags:    

Similar News