• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సలార్.. ఇంకా ఎన్ని రోజులు...

సలార్.. ఇంకా ఎన్ని రోజులు తీసిందే తీస్తారు?

| పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నాడు అనగానే అంచనాలు ఏ స్థాయిలో పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

By - Tupaki Desk
Update: 2023-11-01 08:20 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నాడు అనగానే అంచనాలు ఏ స్థాయిలో పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా ఈ సినిమాతో ప్రభాస్ బాహుబలికి మించిన సక్సెస్ చూస్తాడు అనే కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. కానీ ప్రభాస్ దూరదృష్టమో లేక కంటెంట్ లోపమో తెలియదు కానీ సినిమా విడుదల మాత్రం ఇప్పటికే చాలా ఆలస్యమైంది.

దాదాపు ఒక సంవత్సరం పాటు ఈ సినిమా కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కు ఒక్కసారిగా వాయిదా వార్తతో మేకర్స్ షాక్ అయితే ఇచ్చారు. అయినప్పటికీ ఫ్యాన్స్ ఈ సినిమా మీద ఆశలు అయితే కోల్పోలేదు. గ్రాఫిక్స్ విషయంలోనే కొన్ని లోటు పాట్లను సరి చేసుకుంటున్నారు అని చాలా రకాల గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి.

అంతేకాకుండా ఓటీటీ డీల్ విషయం వల్లనే ఆలస్యమైంది అని కూడా కథనాలు వెలువడ్డాయి. ఇక ఏది ఏమైనప్పటికి సినిమాను ఫైనల్ గా అనుకున్న డేట్ ప్రకారం డిసెంబర్ 22న విడుదల చేస్తే చాలు అని ఆశతో ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ సినిమా ప్రమోషన్స్ విషయంలో మాత్రం మేకర్స్ ఇంకా ఆలస్యం అయితే చేస్తున్నారు. ఈపాటికి ఏదో ఒక విధంగా హడావిడి చేస్తూ సినిమాకు బజ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది.

ఇక లేటెస్ట్ గా మరొక గాసిప్ అయితే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారి పోయింది. సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ మళ్ళీ రీ షూట్ చేస్తున్నారట. దర్శకుడు ప్రశాంత్ నీల్ గత పది రోజులుగా ప్రభాస్ తో అవసరంలేని కొన్ని సన్నివేశాలు మళ్ళీ బెస్ట్ విజువల్స్ తో వచ్చేలా రీ షూట్ చేశారని తెలుస్తోంది. గతంలో కూడా ఈ సీన్స్ ను ఒక సారి దర్శకుడు రీ షూట్ చేసినట్లు సమాచారం.

అయితే ఇప్పుడు విడుదలకు ఇంకా టైం దగ్గర పడుతున్న తరుణంలో ఈ విధంగా తీసిన సన్నివేశాలని మళ్ళీ రీషూట్ చేయడం ఏమిటో అన్నట్లుగా ఫ్యాన్స్ నుంచి కొంత నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుని స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అసలే పాన్ ఇండియా సినిమా కాబట్టి ప్రమోషన్స్ కోసం మేజర్ లాంగ్వేజస్ లో తిరగాల్సిన అవసరం ఉంది. మరి ఆ విషయంలో చిత్ర యూనిట్ ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి.

Tags:    
  • Salaar 
  • Prasanthneel 
  • Hombalefilms 
  • Bahubali 
  • Ottpaltfarm 
  • Tollywood 
  • Filmindustry 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS