• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'సలార్ 2' షూటింగ్...

'సలార్ 2' షూటింగ్ ఎప్పుడు?

| సలార్‌ పార్ట్‌ 1 భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో పార్ట్‌ 2 ఎప్పుడు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-01-29 10:32 GMT

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొంది గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సలార్‌ 1' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. కేజీఎఫ్‌ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వచ్చిన ఈ సినిమా అభిమానుల మరియు ప్రేక్షకుల అంచనాలు అందుకుని విజయాన్ని సొంతం చేసుకుంది.

సలార్‌ పార్ట్‌ 1 భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో పార్ట్‌ 2 ఎప్పుడు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సలార్‌ 2 కి సంబంధించిన షూటింగ్ కొంత మేరకు ఇప్పటికే జరిగిందనే ప్రచారం జరిగింది. కానీ సలార్‌ 2 కి సంబంధించిన షూటింగ్ ఇంకా మొదలు పెట్టలేదని నిర్మాత పేర్కొన్నారు.

కొన్ని వారాల క్రితం నిర్మాత విజయ్ కిరగందూర్‌ మీడియాతో మాట్లాడుతూ సలార్‌ 2 సినిమా షూటింగ్‌ 2024 నవంబర్ నుంచి మొదలు పెట్టబోతున్నట్లు ప్రకటించాడు. 2025 లో సినిమా విడుదల అయ్యే విధంగా ప్లాన్‌ చేస్తున్నట్లుగా కూడా ఆయన పేర్కొన్నాడు.

ఈ ఏడాది చివర్లో షూటింగ్‌ ప్రారంభించి, వచ్చే ఏడాది క్రిస్మస్ కు సినిమా ను విడుదల చేస్తే కచ్చితంగా మంచి ఫలితం దక్కే అవకాశం ఉందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనుక దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఆ వ్యూహం తోనే ముందడుగు వేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.

సలార్‌ 1 విడుదల తర్వాత ఎన్నో ప్రశ్నలు ప్రేక్షకుల మనసును తొలుస్తున్నాయి. వాటన్నింటికి కూడా సలార్‌ 2 సమాధానం చెప్పాల్సి ఉంది. ఆప్త మిత్రులు, ప్రాణ స్నేహితులు అయిన దేవ, వరద లు ఎందుకు బద్ద శత్రువులు గా మారారు అనేది సలార్‌ 2 లో చూడబోతున్నాం. నిర్మాత చెప్పినట్లుగా 2025 చివరి వరకు సలార్‌ 2 వచ్చేనా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.





 


Tags:    
  • Salaar2 
  • Prabhas 
  • Prashanthneel 
  • Hombalefilms 
  • Ravibasur 
  • Vijaykirangudur 

Similar News

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS