• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సలార్.. గుడ్ న్యూస్...

సలార్.. గుడ్ న్యూస్ ఏమిటంటే..

| వచ్చే ఏడాదికి వరకు ఉంచకుండా ఈ ఏడాదే నవంబర్ లేదా డిసెంబర్ లోనే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

By - Tupaki Desk
Update: 2023-09-09 05:40 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా సలార్. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా ఫస్ట్ పార్ట్ ను ఈ సెప్టెంబర్ లోనే విడుదల చేయనున్నట్లు ఎప్పుడో ఏడాది క్రితమే ప్రకటించింది మూవీటీమ్. కానీ రిలీజ్ కు మరో నెల రోజులు ఉందనగా మేకర్స్ హ్యాండ్ ఇచ్చి షాక్ ఇచ్చారు. దీంతో కొత్త రిలీజ్ డేట్ పై రకరకాల పుకార్లు వినిపిస్తన్నాయి. అయితే తాజాగా కొత్త రిలీజ్ డేట్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. దాదాపు ఇదే కన్ఫామ్ అవ్వొచ్చని తెలుస్తోంది.

వివరాళ్లోకి వెళితే.. సలార్ పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ విషయంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సంతృప్తి చెందలేదని, డిజిటల్ రైట్స్ అమ్మకాలు కూడా జరగలేదని.. వాయిదా ప్రచారంలో రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై నిర్మాణ సంస్థ మాత్రం స్పందించలేదు. అయితే ఇదే సమయంలో రూల్స్ రంజన్ సహా ఇతర సినిమాలు సెప్టెంబర్ 28నే రిలీజ్ కు రెడీ అయిపోవడంతో సలార్ పోస్ట్ పోన్ అధికారికంగా ప్రకటించకపోయినా కన్ఫామ్ అయిపోయింది.

దీంతో సలార్ మళ్లీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కొత్త రిలీజ్ డేట్ చెప్పాలని మేకర్స్ ను సోషల్ మీడియా వేదికగా తెగ అడిగేస్తున్నారు. కానీ నిర్మాణ సంస్థ మాత్రం అస్సలు మాట్లాడట్లేదు.

అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చే అవకాశముందని నిన్న మొన్నటి వరకు ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు అది కాదని తెలుస్తోంది. వచ్చే ఏడాదికి వరకు ఉంచకుండా ఈ ఏడాదే నవంబర్ లేదా డిసెంబర్ లోనే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాదికి సినిమాను పోస్ట్ పోన్ చేయకుండా ఉండేలానే ప్లాన్ చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.

అంటే ఈ చిత్రం దీపావళి లేదా క్రిస్మస్ బరిలో దిగే అవకాశం ఉండొచ్చు. మరి పండగ సమయంలోనే వస్తుందా లేదా కాస్త అటు ఇటుగా వస్తుందా అనేది చెప్పలేం. ఏదేమైనప్పటికీ దీనిపై త్వరలోనే మూవీటీమ్ అధికార ప్రకటన ఇవ్వనుందని అంటున్నారు. ఇక ఈ వార్త తెలుసుకుంటున్న ఫ్యాన్స్ అయితే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. వీలైనంత త్వరగా సినిమా విడుదల చేయాలని కోరుకుంటున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్, టాలీవుడ్ సీనియర్ యాక్టర్ జగపతిబాబు.. పవర్ ఫుల్ విలన్స్ గా నటించారు. హోంబలే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. కేజీయఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించడంతో సినిమాపై భారీ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు గూస్ బంప్స్ తెప్పించాయి.

Tags:    
  • Salaarmovie 
  • Salaar 
  • Prabhas 
  • Panindianmovie 
  • Prashantneel 
  • Homblefilms 
  • Newreleasedate 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS