• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సాయి పల్లవి.. ఈ కాంబో...

సాయి పల్లవి.. ఈ కాంబో సెట్టయితే కేక..

| ఇక దిల్ రాజు, సాయిపల్లవిని విజయ్ దేవరకొండతో జోడీగా తీసుకోవాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-06-07 09:38 GMT

సాయిపల్లవి తక్కువ సినిమాలు చేస్తూ, ప్రతిసారి తన ప్రతిభను చూపిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న నటి. కథ నచ్చి, పాత్రకు స్కోప్ ఉంటేనే సినిమా చేస్తానని నిర్ణయంతో ఉండే ఆమె, ప్రస్తుతం తెలుగులో బిజీగా ఉంది. లవ్ స్టోరీ తర్వాత, మళ్ళీ నాగచైతన్యతో కలిసి చందూ మొండేటి దర్శకత్వంలో తండెల్ అనే యాక్షన్ డ్రామాలో నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

క్యారెక్టర్ ఎంతో నచ్చితే గాని ఆమె బిగ్ హీరోలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ సైడ్ కూడా అడుగులు వేస్తోంది. రణ్‌బీర్ కపూర్‌తో రామాయణంలో నటించబోతోంది. అయితే, ఈ ప్రాజెక్ట్ కాల్షీట్స్ కూడా అంత ఈజీగా సెట్టవ్వడం లేదట, ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులలో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇక దిల్ రాజు, సాయిపల్లవిని విజయ్ దేవరకొండతో జోడీగా తీసుకోవాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు.

రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందబోయే పీరియాడిక్ డ్రామాలో సాయిపల్లవిని హీరోయిన్‌గా తీసుకోవాలని భావిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్‌లో సాయిపల్లవి ఫిదా, ఎంసిఏ సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు మరో హ్యాట్రిక్ ఇవ్వాలని దిల్ రాజు భావిస్తున్నాడు.

కథ విన్న సాయిపల్లవి, కాల్షీట్లు చెక్ చేసుకుని తన అంగీకారాన్ని త్వరలోనే తెలుపుతానని చెప్పారు. ఇక దిల్ రాజు కొన్ని రోజుల వరకు ఆమె కోసం ఎదురుచూడాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా, రామాయణం ప్రాజెక్ట్ కాపీ రైట్స్ వివాదంలో ఉంది. ఇది నిజమైతే పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకొని సాయిపల్లవి రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సినిమాకు కాల్షీట్లు ఇవ్వొచ్చు.

ఇక, విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి ప్యాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే, మరోవైపు మైత్రి మూవీస్ నిర్మాణంలో రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఒక సినిమా కూడా ఉంది. విజయ్ దేవరకొండతో సాయిపల్లవి జోడీగా కనిపించడం అభిమానులకు పెద్ద ఆనందాన్ని కలిగించే విషయం. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయితే, సాయిపల్లవి అభిమానులు తెగ ఆనందపడతారు. ఎప్పుడూ కథకి ప్రాధాన్యత ఇచ్చే సాయిపల్లవి, ఈసారి కూడా అలానే చేస్తుందా? విజయ్ దేవరకొండతో జోడీ కట్టే ఆ ఛాన్స్ ను అందుకుంటుందా? అనేది చూడాలి.

Tags:    
  • Saipallavi 
  • Vijaydevarkonda 
  • Ramayana 
  • Ranbirkapoor 
  • Nagachaitanya 
  • Thandel 
  • Dilrajuproduction 
  • Thefamilyman 
  • Loveme 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS