మెగా మేనల్లుడి నెక్స్ట్ మూవీ.. ఇంకెప్పుడు?

అయితే ఈ ఏడాదిలో అప్పుడే నాలుగు నెలలు పూర్తయ్యాయి. కానీ ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయలేదు సాయి దుర్గ తేజ్.

Update: 2024-05-02 06:01 GMT

వన్ ఆఫ్ ది టాప్ సినీ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ .. సారీ సారీ సాయి దుర్గ తేజ్.. యాక్సిడెంట్ తర్వాత విరూపాక్ష మూవీతో భారీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. గతేడాది ఆ సినిమాతో పాటు తన మామయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో మూవీ కూడా చేశారు. అయితే ఆ చిత్రం అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. ఆ తర్వాత తన ఫ్రెండ్ కోసం ఓ షార్ట్ ఫిల్మ్ లో సాయి దుర్గ తేజ్ యాక్ట్ చేశారు.

అయితే ఈ ఏడాదిలో అప్పుడే నాలుగు నెలలు పూర్తయ్యాయి. కానీ ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయలేదు సాయి దుర్గ తేజ్. గత ఏడాది దర్శకుడు సంపత్ నందితో కలిసి గంజా శంకర్ సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు. బడ్జెట్ సమస్య వల్ల ఈ మూవీ సెట్స్ పై ఇంకా వెళ్లలేదని, ప్రస్తుతం హోల్డ్ లో ఉందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని కూడా కొందరు అంటున్నారు.

ఆ మధ్య ఓ ఈవెంట్ లో గంజా శంకర్ ఆగిపోయిందా అని అడిగితే.. తనకు కూడా తెలియదని అన్నారు సాయి దుర్గ తేజ్. ఇక ఈ యంగ్ హీరో తన నెక్స్ట్ సినిమా ఓ కొత్త డైరెక్టర్ తో చేయనున్నారని సినీ వర్గాల్లో ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది. రాకేష్ అనే యంగ్ డైరెక్టర్ చెప్పిన కథ విని రీసెంట్ గా సాయి తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమా 1940 బ్యాక్ డ్రాప్ లో సాగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

హనుమాన్ తో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అధినేత నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. జులైలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానున్నట్లు వినికిడి. మరో రెండు చిత్రాలను కూడా సాయి దుర్గ తేజ్ అనౌన్స్ చేస్తారని టాక్.

Read more!

షార్ట్ ఫిల్మ్ తర్వాత!

నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సత్య షార్ట్ ఫిల్మ్ లో సాయి దుర్గ తేజ్ యాక్ట్ చేశారు. మ్యూజికల్ హిట్‌ గా నిలిచిన ఈ లఘ చిత్రం పలు అంతర్జాతీయ అవార్డులు కూడా గెలుచుకుంది. అయితే ఈ షార్ట్ ఫిల్మ్ ప్రెస్ మీట్ లో తన పేరు మార్చుకున్నట్లు సాయి ధరమ్ తేజ్ వెల్లడించారు. తన పేరును సాయి దుర్గ తేజ్‌ గా మార్చుకున్నట్లు తెలిపారు. తన తల్లి పేరు అయిన దుర్గను తన పేరులో యాడ్ చేసుకున్నట్లు వివరించారు.

Tags:    

Similar News