• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ కళ్యాణ్ ని...

పవన్ కళ్యాణ్ ని తిట్టినప్పుడు ఎందుకు రియాక్ట్ కాలేదంటే

| సదరు వీడియోపై, యుట్యూబర్ పై చాలా మంది సెలబ్రెటీలు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.

By - Tupaki Desk
Update: 2024-07-18 05:28 GMT

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో తండ్రి కూతురి వీడియోపై యుట్యూబ్ లో అశ్లీలంగా మాట్లాడుకోవడంపై రియాక్ట్ అయ్యి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశాడు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ వీడియోలో తండ్రి కూతుళ్ళ రిలేషన్ పై దారుణ కామెంట్స్ చేసిన యుట్యూబర్ ని అరెస్ట్ చేశారు. ఈ న్యూస్ తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. సదరు వీడియోపై, యుట్యూబర్ పై చాలా మంది సెలబ్రెటీలు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.

అయితే గతంలో కొంతమంది పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా బూతులతో మాట్లాడిన వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. పవన్ కళ్యాణ్ ని ఇంత పచ్చిగా బూతులతో తిడుతుంటే ఎందుకు రియాక్ట్ కాలేదని సాయి ధరమ్ తేజ్ ని కొంతమంది ప్రశ్నించారు. అయితే తేజ్ దీనిపై ప్రస్తుతం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కానీ గతంలో ఓ యుట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూలో సాయి ధరమ్ తేజ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే ఇప్పుడు సమాధానంగా మారుతోంది.

పవన్ కళ్యాణ్ ని ఎవరన్నా తిడితే నాకు చాలా బాధేస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నన్ను, చరణ్, వరుణ్, వైష్ణవ్ ని పిలిచి మాట్లాడారు. నా గురించి ఎవరైనా మాట్లాడితే మీరు అస్సలు రియాక్ట్ కావొద్దు. చాలా మంది అబ్యూజ్ చేస్తూ మాట్లాడుతారు. వాటిపై మీరు అస్సలు స్పందించొద్దు. ఒక వేళ రియాక్ట్ కావాలని అనుకుంటే పూర్తిగా స్టడీ చేయండి. మొత్తం అవగాహన చేసుకోండి. తరువాత మీరు పాలిటిక్స్ లోకి వచ్చి మాట్లాడండి. అలా కాకుండా మీ ప్రొఫెషన్ లో ఉంటూ నన్ను తిట్టారని వాటిపై రియాక్ట్ అవ్వొద్దు…

నన్ను ఏమైనా అంటే మీకు కోపం వస్తుందని నాకు తెలుసు. కానీ వాటి గురించి నేను చూసుకుంటా, మీ కెరియర్ ని మీరు చూసుకోండి. మీ సపోర్ట్ నాకు లైఫ్ లాంగ్ ఉంటుందని నాకు తెలుసు. మీరు ప్రత్యేకంగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నా మీద వచ్చే విమర్శలపై మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో రియాక్ట్ కావొద్దని చెప్పారంటూ ఇంటర్వ్యూలో సాయి ధరమ్ తేజ్ పేర్కొన్నారు.

ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ని ఎవరు ఎన్ని విమర్శలు చేసిన, దారుణంగా అవమానకరంగా మాట్లాడిన మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ రియాక్ట్ కారు. దీనిపై సోషల్ మీడియాలో జనసైనికులు, అలాగే పవర్ స్టార్ అభిమానుల నుంచి వినిపించే ప్రశ్నలకి సాయి ధరమ్ తేజ్ నుంచి ఆ ఇంటర్వ్యూ ద్వారా సమాధానం వచ్చినట్లే అని చెప్పాలి.

Tags:    
  • Saidharamtej 
  • Pawankalyan 
  • Tollywood 
  • Megafamily 
  • Powerstarfans 
  • Filmindustry 
  • Youtubearrest 
  • Pawankalyanpolitics 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS