సాయి ధరమ్ తేజ్.. 100 కోట్ల బడ్జెట్టా..

ఇక ఇప్పుడు "హనుమాన్" నిర్మాత నిరంజన్ రెడ్డి సాయిధరమ్ తేజ్ కి గట్టి అడ్వాన్స్ ఇచ్చి, తన తదుపరి చిత్రాన్ని ఖాయం చేశారని తెలుస్తోంది.

Update: 2024-05-23 08:09 GMT

సాయిధరమ్ తేజ్, గత ఏడాది "విరూపాక్ష" విడుదల అనంతరం కొంత గ్యాప్ తీసుకున్నప్పటికి ఇప్పటివరకు తన తదుపరి ప్రాజెక్ట్ పై స్పష్టత ఇవ్వలేదు. ఆ మధ్య పలు సినిమాలపై చర్చలు జరిపారు కానీ, వాటిలో కొన్నిటి పనులు ప్రారంభం కాకుండానే ఆగిపోయాయి. ముఖ్యంగా సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ అనే సినిమా మొదలయ్యింది కానీ అది సడన్ గా ఆగిపోయింది.

సాయిధరమ్ తేజ్ "విరూపాక్ష" తరువాత చేసిన యాక్సిడెంట్ నుండి పూర్తిగా కోలుకునేందుకు కొంత సమయం తీసుకున్నారు. గత ఏడాది ప్రత్యేక చికిత్స కోసం అమెరికాకు వెళ్లి, చికిత్స తీసుకున్న తర్వాత తిరిగి వచ్చి, కొత్త కథలు వినడం ప్రారంభించారు. విరూపాక్ష మార్కెట్ లో 100 కోట్ల బిజినెస్ చేయడం అతని కెరీర్ కు బాగా బూస్ట్ ఇచ్చింది. ఇక పవన్ తో చేసిన బ్రో సినిమా కమర్షియల్ గా బాగానే క్లిక్కయ్యింది.

ఇక ఇప్పుడు "హనుమాన్" నిర్మాత నిరంజన్ రెడ్డి సాయిధరమ్ తేజ్ కి గట్టి అడ్వాన్స్ ఇచ్చి, తన తదుపరి చిత్రాన్ని ఖాయం చేశారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ తో రోహిత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమా పూజా కార్యక్రమాలతో ఈ జూన్ నెలలో గ్రాండ్ గా ప్రారంభం కానుంది. సినిమా బడ్జెట్ దాదాపు రూ. 100 కోట్లు ఉంటుందని సమాచారం, ఇప్పటివరకు ఇంత బిగ్ బడ్జెట్ లో సాయి సినిమా చేయలేదు. ఇది పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది విడుదల కానుంది.

Read more!

రాజకీయ అంశాలపై, యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమా పై అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సాయిధరమ్ తేజ్ కొత్త యవతరం దర్శకులైన రోహిత్ తో కలిసి చేస్తున్న ఈ ప్రయోగాత్మక ప్రాజెక్ట్, టాలీవుడ్ లో మరో సంచలనంగా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నారు. అలాగే సాయిధరమ్ తేజ్ మరిన్ని కొత్త ప్రాజెక్ట్స్ పై సంతకం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఈ కొత్త ప్రాజెక్ట్ తో పాటు ఆయన మరిన్ని సినిమాలకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా పరిశ్రమలో మేగా హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సాయిధరమ్ తేజ్, రాబోయే ఈ భారీ ప్రాజెక్ట్ తో మరింత ప్రతిష్టాత్మకంగా ముందుకు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక రోహిత్ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. మొత్తం మీద సాయిధరమ్ తేజ్ తన కొత్త ప్రాజెక్ట్ తో మరింత హుషారుగా ముందుకు సాగుతున్నారు.

Tags:    

Similar News