సాయిపల్లవిని ఇబ్బందిపెట్టిన దురంధర్?
దక్షిణాదిన ఎదురేలేని స్టార్ గా వెలిగిపోతోంది సాయిపల్లవి. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ లో నటిస్తోంది. అసలు జయాపజయాలతో పని లేని నటిగా వరుస అవకాశాలు అందుకుంటోంది.;
దక్షిణాదిన ఎదురేలేని స్టార్ గా వెలిగిపోతోంది సాయిపల్లవి. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ లో నటిస్తోంది. అసలు జయాపజయాలతో పని లేని నటిగా వరుస అవకాశాలు అందుకుంటోంది. తనదైన నటన, అద్భుత డ్యాన్సింగ్ స్కిల్‌తో ఇప్పటికే పరిశ్రమలోకి వేవ్స్ పంపిన సాయిపల్లవి ఇటీవల వరుసగా పాన్ ఇండియన్ సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది.
ముఖ్యంగా నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న `రామాయణం`లో సీతాదేవి పాత్రలో అవకాశం అందుకుంది ఈ భామ. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్నారు. దీంతో పాటు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన నటించిన రొమాంటిక్ డ్రామా `మేరే రహో` విడుదలకు సిద్ధమైంది. సాయిపల్లవి మరోసారి క్లాసిక్ మూవీతో ఫ్యాన్స్ ని అలరించనుంది.
అయితే సాయిపల్లవి సినిమాకి `దురంధర్` బిగ్ బ్రేక్స్ వేసాడని గుసగుస వినిపిస్తోంది. నిజానికి `మేరే రహే` చిత్రాన్ని గత ఏడాది డిసెంబర్ 12న విడుదల చేయాలని ప్లాన్ చేసారు. కానీ అనూహ్యంగా వాయిదా పడింది. దీనికి కారణం రణ్‌వీర్ సింగ్ నటించిన `దురంధర్` అద్భుతంగా ఆడుతుండటమే. ఈ చిత్రం విడుదలై కొన్ని వారాల పాటు అద్బుత వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో కార్తీక్ ఆర్యన్ రొమాంటిక్ కామెడీ కూడా విడుదలైంది. దీంతో ఇది సరైన సమయం కాదని భావించి అమీర్ ఖాన్ బృందం ఈ చిత్రాన్ని తరవాత విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు 2026 వేసవిలో విడుదల కానుంది. పరిశ్రమలోని ప్రముఖులు జూలై రిలీజ్ సరైన ఆలోచన అని సూచిస్తున్నారు. `మేరే రహో` మూవీ చిత్రీకరణ సహా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయింది. ఏప్రిల్ 2025 నాటికి టాకీ చిత్రీకరణ ముగిసింది. ఈ ప్రాజెక్ట్ మార్కెటింగ్ బాధ్యతలను స్వయంగా ఆమిర్ ఖాన్ చూసుకుంటున్నారు. ట్రేడ్ ప్రకారం.. రిలీజ్ తేదీని వాయిదా వేయడం వెనక అమీర్ కీలక పాత్ర పోషించారు. డిసెంబర్ చాలా ఒత్తిడితో కూడిన సమయం. దురంధర్ అద్భుతంగా ఆడుతోంది. కార్తీక్ సినిమా కూడా వచ్చింది. అందుకే దీనిని వాయిదా వేసారని తెలుస్తోంది. `మేరే రహో` వంటి కంటెంట్ ఆధారిత ప్రేమథా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆ రెండిటితో పోటీపడి బలమైన స్థానం సంపాదించుకోవడం కష్టమని ఆ అంతర్గత వ్యక్తి పేర్కొన్నారు. అందుకే జూలై సరైన సమయం అని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ సినిమాకి ఎక్కువ స్క్రీన్లు అవసరమని కూడా అమీర్ భావిస్తున్నారట.
సాయి పల్లవి- జునైద్ ఖాన్ నటించిన ఈ చిత్రం 2016 థాయ్ రొమాన్స్ `వన్ డే` చిత్రానికి హిందీ రీమేక్. ఈ చిత్రానికి సునీల్ పాండే దర్శకత్వం వహించారు. ఇది సాయి పల్లవికి ఒక కీలక మైలురాయి. మేరే రహో అధికారిక విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు.