తలైవాతో 'న్యాచురల్ బ్యూటీ'.. ఆమె ఒప్పుకుందంటే..
సూపర్ స్టార్ రజినీకాంత్ స్పీడ్ చూస్తుంటే కుర్ర హీరోలు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. కూలీ, జైలర్ 2 సినిమాలు లైన్లో ఉండగానే మరో భారీ సినిమాను పట్టాలెక్కిస్తున్నారు.;
సూపర్ స్టార్ రజినీకాంత్ స్పీడ్ చూస్తుంటే కుర్ర హీరోలు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. కూలీ, జైలర్ 2 సినిమాలు లైన్లో ఉండగానే మరో భారీ సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. అయితే ఈసారి రజినీ సినిమా అనగానే డైరెక్టర్ ఎవరు అనే దానికంటే, అందులో నటిస్తున్న ఒక నటి పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. ఆమె ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్ వేల్యూ అమాంతం పెరిగిపోయింది. కేవలం గ్లామర్ కోసం కాకుండా, నటనకు ఆస్కారం ఉంటే తప్ప ఓకే చెప్పని ఆ భామ, తలైవా సినిమాకు సై అనడం ఇప్పుడు హాట్ టాపిక్.
సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. అందుకే మన 'న్యాచురల్ బ్యూటీ' సాయి పల్లవి పెద్ద హీరోల సినిమాలను చాలాసార్లు సున్నితంగా తిరస్కరించారు. గతంలో ఒక పెద్ద హీరో ఆఫర్ ను కూడా ఆమె వద్దన్న విషయం తెలిసిందే. అలాంటిది ఇప్పుడు రజినీకాంత్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే.. అందులో కంటెంట్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అసలు విషయానికొస్తే.. రజినీకాంత్ 173వ సినిమాకు 'పార్కింగ్' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న రామ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పుడు అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిన విషయం ఏంటంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో సాయి పల్లవి ఒక కీలక పాత్రలో నటించబోతోంది. చాలా కాలం తర్వాత ఒక బిగ్ స్టార్ సినిమాలో ఆమె కనిపించబోతుండటం విశేషం. ఆమెతో పాటు వెర్సటైల్ యాక్టర్ కదిర్ కూడా ఈ సినిమాలో భాగం కానున్నాడు.
ఈ సినిమా కథపై కూడా ఇండస్ట్రీలో ఒక క్లారిటీ వచ్చింది. గతంలో డైరెక్టర్ శింబుకు చెప్పిన కథతోనే రజినీతో తీస్తున్నారని రూమర్స్ వచ్చాయి. కానీ అది నిజం కాదని, తలైవా ఇమేజ్ కు తగ్గట్టుగా ఇది పూర్తిగా కొత్త కథ అని తెలిసింది. ఇక ఈ సినిమాకు మ్యూజికల్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. రజినీ అనిరుధ్ కాంబో అంటే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే.
సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్ ఒప్పుకుందంటే, కచ్చితంగా ఆమె పాత్రకు కథలో ఎంతో బలం ఉండి ఉంటుంది. కేవలం పాటలు, డ్యాన్సుల కోసమే అయితే ఆమె ఎప్పుడో స్టార్ హీరోల పక్కన కమర్షియల్ సినిమాలు చేసేది. కానీ కంటెంట్ ను బలంగా నమ్మే ఆమె, రజినీ సినిమాలో ఉందంటే.. దర్శకుడు రామ్‌కుమార్ ఏదో కొత్త మ్యాజిక్ ప్లాన్ చేశాడని, ఆమె పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు.
మొత్తానికి 'తలైవా 173' ఇప్పుడు సౌత్ ఇండియాలోనే మోస్ట్ హైప్డ్ ప్రాజెక్ట్ గా మారింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైపోయాయి. ఒకవైపు రజినీ మాస్, మరోవైపు సాయి పల్లవి క్లాస్ పెర్ఫార్మెన్స్, దానికి అనిరుధ్ బీట్స్.. ఈ కాంబినేషన్ ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. మరి సాయి పల్లవి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.