మాస్ కాదు, కంటెంట్ ఉండాలి : సాయి దుర్గా తేజ్
ఆడియెన్స్ ను ఎగ్జైట్ చేసే, కొత్త తరహా కథలు రావాలని హీరో సాయి దుర్గా తేజ్ ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ అన్నారు.;
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధపురి సినిమాతో విజయం దక్కించుకున్నారు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఫీమేల్ లీడ్ లో నటించింది. సెప్టెంబర్ 12న రిలీజైన ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతోంది. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి, ఆడియన్స్‌కు థాంక్స్ చెప్పారు.
ఈ ఈవెంట్ కు డైరెక్టన్ అనిల్ రావిపూడి, అనుదీప్, వశిష్ఠ, బాబీ లతో పాటు మెగా హీరో సాయి దుర్గా తేజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆడియెన్స్ ను ఎగ్జైట్ చేసే, కొత్త తరహా కథలు రావాలని హీరో సాయి దుర్గా తేజ్ ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ అన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ ఎవల్యూనషనరీ ఫేస్ లో ఉందని.. మాస్ సినిమాలే కాదు కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకులు ఆదరిస్తారని అన్నారు.
మాస్ సినిమాలు కాదు, మంచి, కొత్త కథలు, ఆడియెన్స్ ను ఎగ్జైట్ చేసే కథలు రావాలి. అలా అయితేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. ప్రతీ ఒక్కటి కరెక్ట్ గా చేయడం మన బాధ్యతే. డైరెక్టర్లు కూడా కథలు రాసేటప్పుడు జాగ్రత్తగా రాయాలి. నిన్న ఓ సినిమాకు వెళ్దామని మా ఫ్రెండ్స్ ను టికెట్ బుక్ చేయమని చెప్పాను. ఆ సినిమాకు టికెట్లు లేవని అతను అన్నాడు. అది కాకపోతే ఇంకో సినిమాకు చేయమని చెప్పాను. అదీ కూడా సోల్డ్ అయ్యాయని అన్నాడు.
దీనికి సంతోషించా. అందరూ థియేటర్లకు వస్తున్నారు. మంచి కంటెంట్ ఉంటే జనాలు ఆదరిస్తున్నారు. ఒక లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కింధపురి ఇలా మంచి కంటెంట్ ను ఆడియెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీ ఆశ్వీర్వాదాలు మాపై ఇలాగే ఉండాలి, మీ కోసం మంచి మంచి సినిమాలు చేస్తాం. రేపు సూపర్ రాజా సినిమా వస్తుంది. ఈ సినిమాను సింగిల్ షాట్ లో తీశారు. చాలా కష్టపడి, కొత్త ప్రయత్నం చేశారు. అందుకే కొత్త వాళ్లను ప్రోత్సహించండి. అని సాయి దుర్గా తేజ్ అన్నారు.
హార్రర్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. రెండో వారంలోనూ సినిమాకు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రశంసలు కురిపించారు. సినిమా అదిపోయిందంటూ పోస్ట్ చేశారు. ఓవరాల్ గా ఈ సినిమాకు ఆరు రోజుల్లో రూ.18 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చైతన్య భరద్వాజ్ సంగీతం అందించగా.. సాహు గారపాటి నిర్మించారు.