పవన్ లాగే బాలయ్య కూడా.. కానీ ఇక్కడ అదే మెయిన్!
ప్రస్తుతం సమస్యలు పరిష్కారం చేసుకుని దిశగా నిర్మాతలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.;
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ గా రూపొందిన సినిమా.. డిసెంబర్ 5వ తేదీన అంటే నేడే విడుదల కావాల్సి ఉంది. కానీ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ చుట్టూ ఆర్థిక సమస్యలు చేరడం వల్ల తప్పని పరిస్థితిలో విడుదల వాయిదా పడింది.
ప్రస్తుతం సమస్యలు పరిష్కారం చేసుకుని దిశగా నిర్మాతలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అఖండ మూవీ వాయిదా పడిన వేళ.. పవన్ కళ్యాణ్ ఇటీవల తీసుకున్న చొరవ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అఖండ సీక్వెల్ కు వచ్చిన లాంటి సమస్యే రీసెంట్ గా పవన్ నటించిన హరి హర వీరమల్లు టైమ్ లో కూడా వచ్చింది.
ఆ సినిమా రిలీజ్ కు ముందే.. ఫైనాన్షియర్లు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించాలని పట్టుబట్టారు. దీంతో రిలీజ్ వాయిదా పడే స్థాయికి చేరుకుంది. కానీ అప్పుడు పవన్ జోక్యం చేసుకున్నారు. ఇద్దరు బడా నిర్మాతల ద్వారా మొత్తం బకాయిలను క్లియర్ చేయించారు. దీంతో సినిమా సజావుగా థియేటర్స్ లో పెద్ద ఎత్తున విడుదలైంది.
సినిమా రిజల్ట్ అనుకున్నట్లు రాకపోయినా.. పవన్ చొరవ లేకుంటే థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం కష్టమే అని చెప్పాలి. అయితే ఇప్పుడు అఖండ సీక్వెల్ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ రూ.28 కోట్లు బకాయి ఉన్న ఈరోస్ బ్యానర్ మద్రాసు హైకోర్టుకెక్కడంతో సినిమా వాయిదా పడింది. అయితే వీరమల్లు, అఖండది ఒకేలాంటి సమస్య అయినప్పటికీ.. అఖండ ఇష్యూ కోర్టులో ఉంది.
కాబట్టి ఎవరైనా జోక్యం చేసుకోవడానికి వీలు పడదు. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం నడుచు కోవాల్సిందే. దానికి తోడు ఈరోస్ సంస్థ.. ఇప్పుడే పిటిషన్ దాఖలు చేస్తారని ఎక్స్పెక్ట్ చేయరు. దీంతో తన సినిమా విషయంలో బాలయ్య ఆ మ్యాటర్ పై ఫోకస్ చేయకపోయి ఉంటారు. కానీ సినిమాను ఫుల్ గా ప్రమోట్ చేశారు. ఓటీటీ రైట్స్ కు భారీ డీల్ ను సెట్ చేశారని సమాచారం.
ఏదేమైనా బాలయ్య అఖండ-2 నిర్మాతలకు అండగా ఉన్నారని తెలుస్తోంది. కానీ ముందే ఆర్థిక ఇబ్బందులపై ఫోకస్ పెట్టి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి తప్పేదని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే కోర్టు జోక్యం ఉండడంతో బాలయ్య చేతిలో కూడా లేదు. పవన్ లాగే ఆయన కూడా చొరవ తీసుకుంటున్నా కోర్టు సినిమాపై స్టే ఎత్తే వరకు వెయిట్ చేయాల్సిందే.