ఆది సాయి కుమార్ 'శంబాలా'.. రంగంలోకి బడా సంస్థ

టాలీవుడ్ లో వైవిధ్యమైన కథలను ఎంచుకునే హీరోల్లో ఆది సాయి కుమార్ ఒకరు. ఫలితాలతో సంబంధం లేకుండా కొత్త కాన్సెప్టులతో ప్రయోగాలు చేయడం అతని స్టైల్.;

Update: 2025-12-05 13:17 GMT

టాలీవుడ్ లో వైవిధ్యమైన కథలను ఎంచుకునే హీరోల్లో ఆది సాయి కుమార్ ఒకరు. ఫలితాలతో సంబంధం లేకుండా కొత్త కాన్సెప్టులతో ప్రయోగాలు చేయడం అతని స్టైల్. ఇప్పుడు కూడా అలాంటి ఒక డిఫరెంట్ అటెంప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'శంబాలా' అనే ఆసక్తికరమైన టైటిల్ తో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి టాక్ వినిపిస్తోంది. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ బిజినెస్ డీల్ జరిగింది.




యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఒక సూపర్ నాచురల్ థ్రిల్లర్ గా మలిచారు. "ఎ మిస్టికల్ వరల్డ్" అనే ట్యాగ్ లైన్ సినిమా థీమ్ ఏంటో చెబుతోంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభిమొజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం విజువల్ గా చాలా రిచ్ గా ఉండబోతోందట. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియోలు సినిమా క్వాలిటీని చూపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ఈ సినిమా స్థాయిని అమాంతం పెంచే సంస్థ రంగంలోకి దిగింది. టాలీవుడ్ లో అగ్రగామి డిస్ట్రిబ్యూషన్ సంస్థగా పేరున్న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ (LLP) ఈ ప్రాజెక్ట్ కంటెంట్ పై పాజిటివ్ గా స్పందించింది. 'శంబాలా' నైజాం హక్కులను ఫ్యాన్సీ రేటుకు మైత్రీ సంస్థ సొంతం చేసుకుంది. ప్రస్తుతం మార్కెట్ డౌన్ ఉన్న సమయంలో ఈ సినిమాకు ఇంత పెద్ద సంస్థ సపోర్ట్ దొరకడం అంటే మామూలు విషయం కాదు. కంటెంట్ మీద గట్టి నమ్మకం ఉంటేనే మైత్రీ వాళ్లు ఇలా స్టెప్ తీసుకుంటారు. ఇది సినిమాకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్.

థియేట్రికల్ బిజినెస్ మాత్రమే కాదు, నాన్ థియేట్రికల్ గానూ ఈ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకోగా, జీ నెట్ వర్క్ శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకుంది. అలాగే ఓవర్సీస్ లో మూన్ షైన్ సినిమాస్ గ్రాండ్ గా రిలీజ్ చేయబోతోంది. విడుదలకు ముందే అన్ని ఏరియాల్లో బిజినెస్ క్లోజ్ అవ్వడం విశేషం. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో ఆదికి జోడీగా అర్చన అయ్యర్ నటిస్తున్నారు. రవివర్మ, మధునందన్, మీసాల లక్ష్మణ్ వంటి నటులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

హై టెక్నికల్ వాల్యూస్ తో, గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఇస్తూ ఈ సినిమాను తీర్చిదిద్దారు. క్రిస్మస్ పండగకు వస్తున్న ఈ సినిమాపై చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. మైత్రీ డిస్ట్రిబ్యూషన్ తోడవ్వడంతో థియేటర్ల సమస్య కూడా ఉండకపోవచ్చు. ప్రమోషన్స్ లో వేగం పెంచిన టీమ్, డిసెంబర్ 25న ఆడియెన్స్ ను థ్రిల్ చేయడానికి రెడీ అయ్యింది. మరి ఈ 'మిస్టికల్ వరల్డ్' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News