పవర్ లిఫ్టింగ్ లో ఎత్తి పడేస్తున్న నటి ప్రగతి!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి అంటే తెలియని వారు ఉండరు. ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.;
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి అంటే తెలియని వారు ఉండరు. ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అలా చాలా సినిమాల్లో హీరో హీరోయిన్లకు తల్లిగా.. అత్తగా.. అక్కగా.. ఇలా ఎన్నో పాత్రలు పోషించి, టాలీవుడ్ లో అమ్మ, అత్త పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. అయితే అలాంటి ప్రగతి సినిమాల్లో పద్ధతిగా కనిపిస్తుంది. కానీ ప్రగతిలో కేవలం నటనా టాలెంట్ మాత్రమే కాదు మరో టాలెంట్ కూడా ఉంది. అదే పవర్ లిఫ్టింగ్.. గతంలో చాలామందికి ప్రగతి పవర్ లిఫ్టింగ్ చేస్తుందనే సంగతి తెలియదు.. సినిమాల్లో తన నటనతో ఎంత టాలెంటెడ్ అనిపించకుందో పవర్ లిఫ్టింగ్ లో కూడా అంతే టాలెంటెడ్ అనిపించుకుంది.
ప్రగతి కేవలం ప్రాంతీయ,జిల్లా లెవల్ పోటీలలో మాత్రమే కాదు సౌత్ ఇండియాతో పాటు నేషనల్ స్థాయిలో కూడా ఎన్నో మెడల్స్ గెలుచుకొని పవర్ లిఫ్టింగ్ లో తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది. అంతేకాదు ఈ సంవత్సరం జరిగిన తెలంగాణ స్టేట్ లెవెల్ పోటీలలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించి అందరితో శభాష్ అనిపించుకుంది. అలాగే కేరళలో జరిగిన నేషనల్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో కూడా పాల్గొని మరో గోల్డ్ మెడల్ గెల్చుకుంది. ఒకప్పుడు సినిమాలకే అంకితమైనటువంటి ప్రగతి 2023లో పవర్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొని తన కల నెరవేర్చుకుంది.
గత రెండు సంవత్సరాల నుండి తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ తో పాటు జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ లో పాల్గొంటూ వరుసగా ఎన్నో గోల్డ్ మెడల్స్ గెలుచుకొని ఛాంపియన్ గా నిలిచింది. అయితే అలాంటి ప్రగతి తాజాగా టర్కీలో జరగబోతున్న ఏషియన్ గేమ్స్ లో కూడా పాల్గొనబోతోంది. నటి ప్రగతి టర్కీలో జరగబోతున్న ఏషియన్ గేమ్స్ లో పవర్ లిఫ్టింగ్ గేమ్ లో పాల్గొనబోతుండడంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారి ఏషియన్ గేమ్స్ లో ప్రగతి గోల్డ్ మెడల్ సాధించాలని చాలామంది కోరుకుంటున్నారు.
మరి ఇప్పటి వరకు పవర్ లిఫ్టింగ్ లో ప్రగతి సాధించిన మెడల్స్ ఏంటి అనే విషయానికి వస్తే.. ఎప్పుడు సినిమాల్లోనే కనిపించే ప్రగతి 2023 నుండి పవర్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొంది.
2023 హైదరాబాదులో జరిగిన డిస్ట్రిక్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించింది.
అదే సంవత్సరంలో తెలంగాణ స్టేట్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ గేమ్స్ లో కూడా గోల్డ్ మెడల్ సాధించింది.
అలాగే 2023లో తెనాలిలో జరిగిన నేషనల్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో 5వ స్థానం గెలుచుకుంది.
2023 ఎల్బి స్టేడియం లో జరిగిన బెంచ్ ప్రెస్ హైదరాబాద్ డిస్ట్రిక్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొని మరోసారి గోల్డ్ మెడల్ అందుకుంది.
అదే సంవత్సరంలో షేక్ పేటలో జరిగిన తెలంగాణ స్టేట్ లెవెల్ పోటీలలో కూడా పాల్గొని బంగారు పథకాన్ని గెలుచుకుంది.
2024 సంవత్సరంలో జరిగిన సౌత్ ఇండియన్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొని సిల్వర్ మెడల్ గెల్చుకుంది.
ఈ ఏడాది ఖైరతాబాద్ లో జరిగిన హైదరాబాద్ డిస్ట్రిక్ లెవల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో పాల్గొని మరోసారి గోల్డ్ మెడల్ సాధించింది.
హైదరాబాద్ రామంతాపూర్ లో జరిగిన పవర్ లిఫ్టింగ్ ఇండియా తెలంగాణ స్టేట్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొని గోల్డ్ మెడల్ అందుకుంది.
ఇదే ఏడాది కేరళలో జరిగిన పవర్ లిఫ్టింగ్ ఇండియా నేషనల్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో పాల్గొని మరోసారి గోల్డ్ మెడల్ చేజిక్కించుకుంది.
ఇలా వరుసగా పాల్గొన్న ప్రతి పోటీలలో గోల్డ్ మెడల్ సాధించి ప్రగతి ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. ఇక రేపు టర్కీలో జరగబోయే ఏషియన్ గేమ్స్ లో పవర్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొనబోతుంది కాబట్టి ఏషియన్ గేమ్స్ లో కూడా ప్రగతి గోల్డ్ మెడల్ సాధించి దేశానికి గర్వకారణంగా నిలవాలని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.