నా లైఫ్ లో విలన్ అతనే : తేజ్

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ లేటెస్ట్ గా మయసభ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.;

Update: 2025-07-31 17:30 GMT

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ లేటెస్ట్ గా మయసభ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. దేవా కట్టాతో తనకు 10 ఏళ్లకు పైగా పరిచయం ఉందని. ఆయన చేసిన ఆటోనగర్ సూర్య టీజర్ చూసి ఆయనకు కాల్ చేశానని అన్నారు తేజ్. అంతేకాదు ఆయన నేను జిం చేసే టైం లో కలిసే వాళ్లమని అన్నారు తేజ్. తనతో ఏదైనా సినిమా చేయమని అడిగే వాడిని.. ఫైనల్ గా 2021 లో రిపబ్లిక్ సినిమా చేశాం. ఆ సినిమా టైం లోనే ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పారు సాయి ధరం తేజ్.

విలన్ అంటే అది చైతన్య రావు..

ఆది పినిశెట్టితో కలిసి డాన్స్, కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్లమని అన్నారు తేజ్. ఇక నా లైఫ్ లో ఉన్న విలన్ అంటే అది చైతన్య రావు అని అన్నారు. 30 వెడ్స్ 21 సినిమా చూసి అమ్మ పెళ్లి ప్రస్తావన తెచ్చేది. ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు.. నువ్వెందుకు చేసుకోవని అంటుంది. కంగారు పడకు చేసుకుంటా అని చెప్పా అని సాయి ధరం తేజ్ అన్నారు.

ఇక తనతో సినిమా చేసే టైంలోనే తన లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిదెంట్ తెలిసిందే. ఆ టైం లో కూడా దేవా కట్ట తనతో ఉన్నారని తేజ్ అన్నారు. ఆది పినిశెట్టి, చైతన్య రావు లీడ్ రోల్ లో మయసభ సినిమా చేశారు దేవా కట్ట. సోనీ లివ్ లో ఆగష్టు 7న ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

దేవా కట్ట స్ట్రాంగ్ రైటింగ్..

ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో తేజ్ హంగామా చేశారు. దేవా కట్ట స్ట్రాంగ్ రైటింగ్ ఆడియన్స్ కు నచ్చుతుంది. SSMB 29 కి కూడా దేవా కట్ట తన పెన్ పవర్ చూపిస్తున్నాడని టాక్. రాజమౌళి బాహుబలి లో కూడా దేవా కట్ట డైలాగ్స్ వాడారు.

రాజమౌళి మహేష్ సినిమాలో దేవా కట్ట డైలాగ్స్ అనగానే సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడుతుంది. రిపబ్లిక్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న దేవా కట్ట మయసభతో మళ్లీ తన సత్తా చాటనున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీగా వస్తున్న ఈ సినిమా ఏమేరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

ఇక తేజ్ సినిమాల విషయానికి వస్తే అతను ప్రస్తుతం సంబరాల యేటి గట్టు సినిమా చేస్తున్నాడు. రోహిత్ డైరెక్షన్ లో పీరియాడికల్ యాక్షన్ సినిమాగా వస్తుంది.

Tags:    

Similar News