తేజ్ 'ఇది మామూలు ప్రేమ కాదు'

ఇది సాధారణ ప్రేమకథ కాదని, కథలో ఓ ప్రత్యేకత ఉందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.;

Update: 2025-03-26 12:30 GMT

సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్రస్తుతం తన కెరీర్‌లో కొత్త దశలోకి ప్రవేశిస్తున్నట్టే కనిపిస్తోంది. ‘విరుపాక్ష’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో ఓవర్‌నైట్ విజయం అందుకున్న తేజ్, ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో అనే సినిమా చేశాడు. అయితే ఆ సినిమా అంతగా క్లిక్ కాలేదు. ఇక ఇప్పుడు ‘సంబ‌రాల ఏటి గ‌ట్టు’ (SYG) అనే భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఈ సినిమాలో లుక్‌, బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ ఇప్పటికే సోషల్ మీడియాలో హైలెట్ అవుతూ, మంచి హైప్ క్రియేట్ చేసింది. గ్లింప్స్ తోనే అభిమానుల ఊహల‌కు పదును పెట్టిన తేజ్ ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ పైనే ఫోకస్ చేస్తున్నారు. SYG లాంటి మాస్ యాక్షన్ సినిమా తర్వాత తేజ్ మరొకసారి ప్రేక్షకులను ఆశ్చర్యపెట్టే రీతిలో స్క్రిప్ట్ ఎంచుకున్నారని టాక్. ఈసారి ప్రేమ నేపథ్యంలో ఓ ఎమోషనల్ కథను ఎంపిక చేసినట్టు సమాచారం.

ఇది సాధారణ ప్రేమకథ కాదని, కథలో ఓ ప్రత్యేకత ఉందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు, తేజ్ కూడా తన ఎమోషనల్ సైడ్‌ను ఎక్స్‌ప్లోర్ చేసే సినిమాకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. మరి ‘విరుపాక్ష’ తర్వాత ఎమోషనల్ కంటెంట్‌లో ఆయన ఏ స్థాయిలో ఇంపాక్ట్ చేస్తారో చూడాలి. తాజాగా ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం, తేజ్ తదుపరి సినిమా దాదాపుగా ఫిక్స్ అయినట్టు సమాచారం.

ఒక తమిళ దర్శకుడితో కలిసి తేజ్ ఈ సినిమాను చేయనున్నాడు. ఈ దర్శకుడు గత రెండేళ్లుగా ఈ కథపై కసరత్తు చేస్తుండగా, ఇప్పుడు తేజ్ పర్సనల్‌గా కథను విని ఒకే చెప్పినట్టు టాక్. కథ నచ్చడంతో పాటు, స్క్రీన్‌ప్లే కూడా బలంగా ఉండటంతో తేజ్ తన కమిట్‌మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘ఇది మామూలు ప్రేమ కాదు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. టైటిల్ వినడానికే డిఫరెంట్‌గా అనిపిస్తున్నప్పటికీ, ఇందులో ప్రేమకథలోని ఎమోషన్లు, టర్నింగ్ పాయింట్లు మరింతగా ఆకట్టుకునేలా ఉండబోతున్నాయని తెలుస్తోంది.

ప్రేమలో వచ్చే సంఘర్షణలు, ఎమోషనల్ షేడ్స్‌కు స్క్రీన్‌ప్లే కరెక్ట్‌గా మిళితమై ఉండేలా సినిమా రూపొందనుందట. సాయి తేజ్ కెరీర్‌లో ఓ కొత్త కోణాన్ని చూపించే కథ ఇది అవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఎప్పుడెప్పుడు మొదలవుతుందో అనే విషయంలో ఇంకా అధికారిక సమాచారం రాలేదు. కానీ ప్రస్తుతం SYG పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా, ఈ కొత్త సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ పూర్తవుతోందని సమాచారం. నిర్మాతలు, ఇతర సాంకేతిక వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయని భావిస్తున్నారు.

Tags:    

Similar News