AA22×A6: కుర్రాడితో అసలు పని స్టార్ట్ చేసిన అట్లీ!

పాన్ ఇండియా లెవెల్లో ఎక్కడికక్కడ హైప్‌ క్రియేట్ చేస్తున్న ఓ ప్రాజెక్ట్ అంటే అది అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కనున్న AA22xA6 మూవీ.;

Update: 2025-07-18 06:15 GMT

పాన్ ఇండియా లెవెల్లో ఎక్కడికక్కడ హైప్‌ క్రియేట్ చేస్తున్న ఓ ప్రాజెక్ట్ అంటే అది అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కనున్న AA22xA6 మూవీ. 'జవాన్' సూపర్ సక్సెస్ తర్వాత అట్లీ దృష్టి పూర్తిగా ఈ సినిమాపైనే ఉంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ జోరుగా జరుగుతోంది. బన్నీ అట్లీ కాంబో నుంచి వస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమా స్టైల్, కంటెంట్, మేకింగ్ ఎలాగుంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా గురించి వస్తున్న అప్‌డేట్స్‌లో తాజా హైలైట్‌ సాయి అభ్యంకర్‌ హైలెట్ అవుతున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో అతడే టాప్ టాక్. వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమే అయినా ఇప్పటి వరకూ ఏ సినిమా కూడా రిలీజ్ కాకముందే ఎనిమిది ప్రాజెక్ట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. అలాంటి కుర్రవాడిని అట్లీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ AA22కి ఎంపిక చేయడం సినిమాకి ఓ స్పెషల్ టచ్ కలిపినట్లైంది. ఇది టాలెంట్‌ను ఎలా గుర్తించాలో అట్లీకి తెలిసినట్టు మరోసారి నిరూపితమైంది.

తాజాగా అట్లీ, సాయి అభ్యంకర్‌ మధ్య ఓ మ్యూజిక్ సెషన్ వీడియో కాల్‌లో జరిగిందని తెలుస్తోంది. 'ఆన్‌లైన్ జ్యామ్స్' అంటూ సాయి అభ్యంకర్‌ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అట్లీ కూడా ఈ పోస్టును రీషేర్ చేస్తూ ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయని సంకేతాలిచ్చాడు. దీనివల్ల ఇప్పుడే మ్యూజిక్ పనుల దశలోకి వెళ్తున్న AA22 ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

ఈ వీడియో కాల్‌ను చూసి అట్లీ సాయి అభ్యంకర్ కాంబో నుంచి డిఫరెంట్ ట్యూన్స్ వస్తాయనే ఫీలింగ్ జనాల్లో క్రియేట్ అయ్యింది. సాయి అభ్యంకర్ ఇప్పటికే సూర్య, కార్తీ, శివకార్తికేయన్, శింబు, లారెన్స్, షేన్ నిగమ్‌లతో ప్రాజెక్ట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. కానీ అల్లు అర్జున్‌తో AA22 ప్రాజెక్ట్ అతడి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా మారే అవకాశం ఉంది. ఈ సినిమాలో మ్యూజిక్ భారీగా ఉండబోతుందని ట్రేడ్ వర్గాల అంచనా.

మాస్, క్లాస్ రెండు టోన్లను మిక్స్ చేస్తూ సాయి అందించే సంగీతం సినిమా విజువల్స్‌కు సపోర్ట్‌గా నిలవనుందని తెలుస్తోంది. పాన్ ఇండియా ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఈ ఆల్బమ్ ఉంటుందని టీమ్ భావిస్తోంది. ఇక సినిమా విషయానికొస్తే, AA22 హై బడ్జెట్‌తో తెరకెక్కనున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోంది. బన్నీని గతంలో ఎన్నడూ లేని పవర్‌ఫుల్ రోల్‌లో చూడబోతున్నాం. ప్రస్తుతం అట్లీ స్క్రిప్ట్, సెట్ డిజైన్‌, మ్యూజిక్ పనులపై దృష్టి పెట్టగా, రెగ్యులర్ షూటింగ్‌కి రంగం సిద్ధమవుతోంది. ఈ సినిమాతో అట్లీ, బన్నీ ఇద్దరూ కొత్త రికార్డులు సెట్ చేయాలనే లక్ష్యంతో ఉన్నారని తెలుస్తోంది. ఇక మ్యూజిక్ పక్కాగా ఉంటే హైప్ మరింత పెరగడం ఖాయం.

Tags:    

Similar News