'సఃకుటుంబానాం' ప్రీమియర్స్.. ఫస్ట్ స్టెప్ లో సక్సెస్..

ఫ్యామిలీ ఎంటర్టైనర్ సఃకుటుంబానాం మూవీ.. కొత్త ఏడాది కానుకగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.;

Update: 2025-12-31 09:15 GMT

ఫ్యామిలీ ఎంటర్టైనర్ సఃకుటుంబానాం మూవీ.. కొత్త ఏడాది కానుకగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ యువ నటీనటులు రామ్ కిరణ్, మేఘా ఆకాశ్ జంటగా నటించిన ఆ మూవీ.. జనవరి 1వ తేదీన విడుదల అవ్వనుంది. కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ప్రారంభించేందుకు ప్రేక్షకుల ముందుకు రానుంది.



 


ఇప్పటికే సినిమా మేకర్స్ విడుదల చేసిన సఃకుటుంబానాం ట్రైలర్‌ కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ లభించింది. దీంతో మూవీపై మంచి అంచనాలు మరింత పెరిగాయి. కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను సినిమా మెప్పిస్తుందని అంతా అంచనా వేశారు. అయితే అదే ఇప్పుడు నిజమయ్యేలా స్పష్టంగా కనిపిస్తోంది.



 


థియేటర్లలో విడుదలకు ముందే సెలెక్ట్ చేసిన కుటుంబ ప్రేక్షకుల కోసం ప్రత్యేక ప్రీమియర్ షోలు వేశారు సఃకుటుంబానాం మేకర్స్. ఆ షోలకు వచ్చిన సూపర్ రెస్పాన్స్ తో ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. చాలా థియేటర్లలో హౌస్‌ ఫుల్ ఆక్యుపెన్సీ నమోదు కాగా, కుటుంబ సభ్యులంతా కలిసి సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. దీంతో మేకర్స్ ఫస్ట్ స్టెప్ లో సక్సెస్ అయ్యారు.



 


ప్రీమియర్ షో చూసిన ఆడియన్స్.. సినిమా బాగుందని చెప్పారు. కుటుంబ విలువలు సహజంగా, హృదయాన్ని తాకేలా చక్కగా సఃకుటుంబానాం చూపించిందని ప్రశంసించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే అంశాలు సినిమాలో ఉన్నాయని.. అందరికీ మూవీ కచ్చితంగా నచ్చుతుందని అభిప్రాయపడ్డారు.



 


దీంతో న్యూ ఇయర్ కు కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా కావాలనుకునే ప్రేక్షకులకు సఃకుటుంబానాం సరైన ఎంపిక అవుతుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తమ సినిమా ప్రేక్షకుల జీవితాల్లో ఆనందం, ఆప్యాయత, కుటుంబ ఐక్యత తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఇక సఃకుటుంబానాం సినిమా విషయానికొస్తే.. రామ్ కిరణ్, మేఘా ఆకాష్ తో పాటు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో నటించారు. సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం వంటి పలువురు నటీనటులు ఇతర పాత్రల్లో యాక్ట్ చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ మ్యూజిక్ అందించారు.

హెచ్ ఎన్ జీ సినిమాస్, ఎల్ ఎల్ పీ బ్యానర్లపై మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మించారు. కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వ బాధ్యతలను ఉదయ్ శర్మ నిర్వర్తించారు. సినిమాటోగ్రాఫర్ గా మధు దాసరి వ్యవహరించారు. ఎడిటర్ గా శశాంక్ మాలి వర్క్ చేశారు. మరికొద్ది గంటల్లో థియేటర్స్ లో విడుదలవనున్న సఃకుటుంబానాం ఎలాంటి హిట్ గా నిలుస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News