• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విశ్వక్ లిస్టులో పవర్...

విశ్వక్ లిస్టులో పవర్ స్టార్ డైరెక్టర్..

| యంగ్ హీరో విశ్వక్ సేన్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘లైలా’ అనే సినిమా విశ్వక్ చేస్తున్నాడు.

By - Tupaki Desk
Update: 2025-01-27 15:30 GMT

యంగ్ హీరో విశ్వక్ సేన్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘లైలా’ అనే సినిమా విశ్వక్ చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే యంగ్ హీరోలలో అందరికంటే వేగంగా మూవీస్ చేస్తోన్న స్టార్ గా విశ్వక్ సేన్ ఉన్నాడు. తనకి సెట్ అయ్యే కథలని ఎంపిక చేసుకుంటూ విశ్వక్ సేన్ టాలెంటెడ్ దర్శకులకి అవకాశాలు ఇస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు కూడా విశ్వక్ సేన్ తో సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు.

ప్రస్తుతం విశ్వక్ సేన్ చేస్తోన్న ‘లైలా’ సినిమాలో అమ్మాయి గెటప్ లో కనిపిస్తున్నాడు. మ్యాకప్ మెన్ గా విశ్వక్ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ‘భీమ్లా నాయక్’ మూవీ తర్వాత సాగర్ కె చంద్ర బెల్లంకొండ శ్రీనివాస్ తో టైసన్ నాయుడు మూవీ చేశారు.

ఈ సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతోంది. దీని తర్వాత విశ్వక్ సేన్ తో మూవీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సినిమా సినిమాకి తన ఇమేజ్ ని పెంచుకుంటూ ముందుకి వెళ్తున్న విశ్వక్.. రొటీన్ కి భిన్నంగా ఉన్న కథలని ఎంపిక చేసుకుంటూ ఉన్నాడు. అలాగే డిఫరెంట్ కాన్సెప్ట్ లను టచ్ చేస్తున్నాడు.. అందుకే విశ్వక్ సేన్ తో మూవీస్ చేయడానికి యంగ్ డైరెక్టర్స్ కూడా మంచి కథలు సిద్ధం చేసుకొని అతనిని అప్రోచ్ అవుతున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘భీమ్లా నాయక్’ మూవీ చేసిన తర్వాత సాగర్ కె చంద్ర ఇమేజ్ పెరిగింది. అయితే అతను కొంత గ్యాప్ తీసుకొని ‘టైసన్ నాయుడు’ మూవీ చేశాడు. ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అవుతోంది. అయితే ఇప్పుడు విశ్వక్ సేన్ తో మూవీని ఒకే చేయించుకున్నాడు. ఇక ఈ సినిమా ‘టైసన్ నాయుడు’ రిలీజ్ తర్వాత స్టార్ట్ అవుతుందా లేదంటే ముందుగానే సెట్స్ పైకి వెళ్తుందా అనేది వేచి చూడాలి.

ఇదిలా ఉంటే మరో వైపు విశ్వక్ సేన్ చేసిన ‘లైలా’ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. దీనికి మంచి స్పందన వచ్చింది. ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. దీనిపైన విశ్వక్ సేన్ చాలా నమ్మకంతో ఉన్నారు. మరి సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Tags:    
  • Sagarkchandra 
  • Bheemlanayak 
  • Tollywood 
  • Filmindustry 
  • Vishwaksen 
  • Movie 
  • Lailamovie 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS