ఫొటో టాక్: యంగ్ టైగర్ కోసం టైగర్ వైబ్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ 'డ్రాగన్' సినిమాలో లీడ్ రోల్ కోసం ఎంపికైన రుక్మిణి వసంత్ ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీగా మారింది.;

Update: 2025-06-19 10:37 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ 'డ్రాగన్' సినిమాలో లీడ్ రోల్ కోసం ఎంపికైన రుక్మిణి వసంత్ ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీగా మారింది. 'సప్త సాగరాలు దాటి' సినిమాతో కన్నడలో పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తెలుగులో ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న 'డ్రాగన్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


ఈ సినిమాలో రుక్మిణి పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉందని టాక్. ఓ ఎమోషనల్ జర్నీలో హీరోకి బలంగా నిలిచే క్యారెక్టర్ అని తెలుస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ నెమ్మదిగా క్యాస్ట్ అప్‌డేట్స్ బయటకు రానివ్వడం, రుక్మిణిని ఎంపిక చేయడం ఈ సినిమా వైవిధ్యాన్ని తెలియజేస్తోంది. ఆమె పాత్ర కథను ముందుకు తీసుకెళ్లే కీలక భాగమవుతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

తాజాగా రుక్మిణి వసంత్ తన కారావాన్‌లో తీసుకున్న సెల్ఫీని షేర్ చేస్తూ సోషల్ మీడియాను ఊపేసింది. తెల్లటి టైగర్ ప్రింటెడ్ షర్ట్, గ్రే ట్రౌజర్స్‌లో కనిపించిన ఈ బ్యూటీ క్యాజువల్ గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఆమె చిరునవ్వు, క్యూట్ ఫేస్ ఎక్స్‌ప్రెషన్ నెట్టింట్లో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాయి. ప్రత్యేకంగా టైగర్ డిజైన్‌లతో ఉన్న ఆమె కాస్ట్యూమ్ ఫ్యాషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బాగానే వర్కౌట్ అయ్యింది.

ఈ ఫోటోకు పెద్ద ఎత్తున రెస్పాన్స్ రావడంతో పాటు, చాలా మంది నెటిజన్లు 'డ్రాగన్' షూటింగ్ లో భాగంగానే తీసుకున్న ఫోటో అని భావిస్తున్నారు. వానిటీ వాన్‌లోనూ, డ్రెస్సింగ్ రూమ్‌లోనూ తీసిన సెల్ఫీలకు రుక్మిణి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ముఖ్యంగా ఆమె నటనతో పాటు తన రియల్ లైఫ్ స్టయిల్‌ను కూడా ఫాలో అయ్యే ఫ్యాన్స్ ఇప్పుడు తెలుగు స్టార్డమ్‌కు ఆమె కొత్త అడుగులు వేస్తుందన్న భావనలో ఉన్నారు.

రుక్మిణి డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ సరసన కనిపించనున్న తొలి సినిమా ఇదే. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్యాంప్ లో ఆమె కెరీర్‌ను మరింత ప్రొఫెషనల్‌గా ప్లాన్ చేస్తూ, అన్ని భాషల్లో అవకాశాల కోసం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 'డ్రాగన్' షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. త్వరలోనే అమ్మడి లుక్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Tags:    

Similar News