టాలీవుడ్ లో అమ్మడు ఖాళీ అయినట్టేనా..?

చిలసౌ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రుహాని శర్మ ఆ సినిమాలో తన పాత్రతో చాలామంది ఆడియన్స్ కి దగ్గరైంది.;

Update: 2025-05-24 02:30 GMT

చిలసౌ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రుహాని శర్మ ఆ సినిమాలో తన పాత్రతో చాలామంది ఆడియన్స్ కి దగ్గరైంది. ఆ సినిమా డైరెక్టర్ రాహుల్ రవిచంద్రన్ రుహానిని ఎలా ఆడిషన్ చేసి తీసుకున్నాడో కానీ ఆన్ స్క్రీన్ కాదు ఆఫ్ స్క్రీన్ కూడా రుహాని అలానే ఉంటుందా అనిపించేలా తన మ్యాజిక్ చూపించింది. ఐతే చిలసౌ తర్వాత హిట్ ఫస్ట్ కేస్ లో నటించిన అమ్మడు అది పర్వాలేదు అనిపించుకున్నా నెక్స్ట్ కథల ఎంపికలో కాస్త ట్రాక్ తప్పింది.

డర్టీ హరి సినిమా చేసిన అమ్మడు ఆ తర్వాత పెద్దగా ఛాన్స్ లు అందుకోలేదు. అవసరాల శ్రీనివాస్ చేసిన నూటొక్క జిల్లాల అందగాడు చేసినా లాభం లేకుండా పోయింది. ఐతే రుహాని శర్మ సినిమాలైతే చేస్తుంది కానీ ఆమె పాపులారిటీ మాత్రం సంపాదించలేకపోయింది. హర్ చాప్టర్ 1, సైంధవ్, ఆపరేషన్ వాలెంటైన్, శ్రీరంగ నీతులు, లవ్ మీ ఇలా చెప్పడానికి కెరీర్ లో చాలా సినిమాలు ఉన్నాయి కానీ అందులో ఏది ఆమెకు సరైన గుర్తింపు తీసుకు రాలేదు.

అంతేకాదు ఆమె గ్రాఫ్ ని పడిపోయేలా చేశాయి. ఐతే రుహాని శర్మ కాన్ఫిడెన్స్ మాత్రం ఎక్కడ లూజ్ అవ్వలేదు. అమ్మడు ఇప్పటికీ తనకు తగిన రోల్ పడితే సత్తా చూపిస్తా అనే అంటుంది. ఐతే తెలుగులో ఒకసారి కెరీర్ డౌన్ అయితే మళ్లీ ఊపందుకోవడం చాలా కష్టం. ఒకటి రెండు కాదు గత రెండేళ్లలో రుహాని చాలా సినిమాల్లో అసలేమాత్రం ఇంపార్టెంట్ లేని పాత్రలు చేసింది. అవన్నీ కూడా ఆమె కెరీర్ కి ఎసరు పెట్టేలా చేశాయి.

ప్రస్తుతం అమ్మడు తమిళ్ లో మాస్క్ సినిమా చేస్తుంది. తెలుగులో లక్ కలిసి రాకపోయినా తమిళం లో అయినా అమ్మడి టాలెంట్ ని గుర్తిస్తారేమో చూడాలి. అమ్మడికి తెలుగు ఆఫర్లు ఇక కష్టమే అని చెప్పొచ్చు. తప్పకుండా రుహాని లాంటి యాక్టర్ కి మంచి పాత్రలు పడితే మాత్రం బాగుంటుందని ఆమెను ఇష్టపడే ఆడియన్స్ అంటున్నారు. మరి ఇప్పటికైనా రుహాని ప్రతిభని ఎవరైనా గుర్తిస్తారా లేదా అన్నది చూడాలి. ఐతే రుహాని కూడా చేస్తే హీరోయిన్ గానే చేస్తా లాంటి లెక్కలేమి లేకుండా వచ్చిన ప్రతి రోల్ చేస్తూ వచ్చింది. ఐతే అదే ఆమెను కెరీర్ లో వెనకపడేలా చేసిందని చెప్పొచ్చు.

Tags:    

Similar News