తీర ప్రాంతంలో రౌడీ-రాణీ మధ్య రొమాన్స్!
విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ జంటగా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో `రౌడీజనార్దన్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.;
విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ జంటగా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో `రౌడీజనార్దన్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. ప్రేమ, రాజకీయం అంశాలను ఆధారంగా చేసుకుని అల్లిన స్క్రిప్ట్ ఇది. ఇందులో విజయ్ పాత్ర మాస్ కోణంలో ఉంటుందని..హీరో పాత్రకు ధీటుగా హీరోయిన్ రష్మిక పాత్ర కూడా ఉంటుందని ప్రచారంలో ఉంది. జనార్దన్ పాత్ర రౌడీ తరహాలో ఉంటే? రౌడీ రాణిలా కీర్తి పాత్ర ఉంటుందని వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ అప్ డేట్ తెరపైకి వచ్చింది.
రొమాన్స్ పీక్స్ లో ఉంటుందా:
ప్రస్తుతం మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఓ తీర ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇదే సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్ గా వినిపిస్తోంది. దీనిలో భాగంగా విజయ్-కీర్తి సురేష్ లపై రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. రొమాన్స్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా
ఉంటాయంటున్నారు. ఇద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు రెగ్యులర్ రొమాన్స్ కు భిన్నంగా ఉంటాయని చెబుతున్నారు. రొమాంటిక్ సన్నివేశాలు విజయ్ దేరకొండకు కొత్తేం కాదు. ఇప్పటి వరకూ నటించిన చాలా సన్నివేశాల్లో రొమాంటిక్ సన్నివేశాల్లో తనదైన మార్క్ వేసాడు.
రొమాంటిక్ భామగా కనెక్ట్ అవుతుందా:
`అర్జున్ రెడ్డి`, `గీతగోవిందం`, `డియర్ కామ్రేడ్` సహా చాలా చిత్రాల్లో తనదైన మార్క్ వేసాడు. కానీ కీర్తి సురేష్ మాత్రం రొమాంటిక్ హీరోయిన్ గా ఇంతవరకూ హైలైట్ కాలేదు. తొలి నుంచి అమ్మడు డీసెంట్ పాత్రలు పోషించుకుంటూ వచ్చింది. హీరోలతో రొమాంటిక్ సన్నివేశాలున్న సినిమాలకు దూరమైంది. ఆ రకంగా చాలా అవకాశాలు కూడా కోల్పోయింది. హీరోయిన్ల రేసులో వెనుకబాటుకు కారణం కూడా అదే. కానీ `సర్కారు వారి పాట` నుంచి కీర్తి కూడా పంథా మార్చింది. గ్లామర్ బ్యూటీ గాహైలైట్ అయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టింది. కానీ ఆ తర్వాత ఆ రకంగా తనను ప్రూవ్ చేసుకునే అవకాశాలు రాలేదు.
రెట్టింపు క్రేజ్ తధ్యం:
`దసరా` లో మాస్ పాత్ర పోషించినా? అందులో రొమాంటిక్ యాంగిల్ హైలైట్ కాదు. `భోళా శంకర్` లో సిస్టర్ పాత్రకే పరిమితమైంది. బాలీవుడ్ సినిమా `బేబి జాన్` లో అటెంప్ట్ చేసింది. కానీ అది హిందీ సినిమా కావడంతో తెలుగు వరకూ చేరలేదు. ఈ నేపథ్యంలో `రౌడీ జనార్దన్` రూపంలో రొమాంటిక్ భామగా ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది. వివాహ బంధంలోకి అడుగు పెట్టిన నేపథ్యంలో నటిస్తోన్న తొలి రొమాంటిక్ చిత్రం కూడా ఇదే అవుతుంది.
కీర్తి సురేష్ రొమాంటిక్ రోల్స్ తో యువతకు కనెక్ట్ అయితే అమ్మడి క్రేజ్ రెట్టింపు అవుతుందడనంలో ఎలాంటి సందేహం లేదు.