చిన్నారి అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన రౌడీ స్టార్.. ఏం చేశారంటే?
పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాదులో తాజాగా జరిగిన ఒక సంఘటనతో మరోసారి సోషల్ మీడియాలో విజయ్ చర్చనీయాంశంగా మారారు.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.విజయ్ దేవరకొండ. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు రియల్ హీరోగా కూడా అనిపించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు తన అభిమానులకు అండగా నిలిచే ఈయన తాజాగా ఒక చిన్నారి అభిమాని కన్నీళ్ళకు కరిగిపోయి ఇచ్చిన భరోసా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది..మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
విజయ్ ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న చిన్నారి అభిమాని..
పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాదులో తాజాగా జరిగిన ఒక సంఘటనతో మరోసారి సోషల్ మీడియాలో విజయ్ చర్చనీయాంశంగా మారారు. హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక టీజీ20 లీగ్ ఫైనల్ మ్యాచ్ కి విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ టోర్నమెంట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఆయన స్టేడియానికి చేరుకోగానే అభిమానులు పెద్ద ఎత్తున విజయ్ కి ఘన స్వాగతం పలికారు. ఆయనను చూసేందుకు, కలుసుకునేందుకు, ఆయనతో మాట్లాడడానికి అభిమానులు తెగ ఆసక్తి కనబరిచారు. అదే సమయంలో విజయ్ ని చూడగానే ఒక చిన్నారి అభిమాని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆవేశాన్ని ఆపుకోలేక దగ్గరకు వెళ్లి .."అన్నా.. నేను చాలా బాగా క్రికెట్ ఆడతాను. కానీ నాకు మాత్రం సరైన ప్రోత్సాహం, అవకాశం లేదు. నువ్వు కొంచెం సపోర్ట్ చేయాలి అన్నా" అంటూ వేడుకున్నాడు. ఇక ఆ చిన్నారి పరిస్థితిని గమనించిన రౌడీ హీరో ఏమాత్రం ఆలోచించకుండా గుండెలకు హత్తుకొని ఓదార్చాడు. అతనితో కొంతసేపు మాట్లాడి వ్యక్తిగత వివరాలు, కుటుంబ పరిస్థితులు తెలుసుకున్నారు.
రౌడీ హీరో రియాక్షన్..
క్రికెట్లో ఎదగాలనే అతడి కలను గౌరవిస్తూ తన వంతు సహాయం చేస్తానని భవిష్యత్తులో అండగా నిలబడతానని హామీ కూడా ఇచ్చారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో విజయ్ అటు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా రియల్ హీరో.. అభిమానుల భావోద్వేగాలను అర్థం చేసుకునే ఒక స్టార్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
రీల్ హీరో కాదు రియల్ హీరో..
నిజానికి విజయ్ దేవరకొండ సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటాడు.ప్రతి ఏడాది దేవరాశాంట కార్యక్రమం ద్వారా తన అభిమానులను విహారయాత్రలకు పంపిస్తూ,, బహుమతులు అందిస్తూ వారితో ప్రత్యేక అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇక మొన్నటికి మొన్న తన పెళ్లికి పిలవలేదు అంటూ అలిగిన ఒక చిన్నారి అలక తీరుస్తూ ఆమెను తన ఇంటికి ఆహ్వానించి, ఆ చిన్నారికి ఇష్టమైన వంటకాలను దగ్గర ఉండి మరీ వడ్డించి, అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఈ బాలుడి కోసం మరో హామీ ఇచ్చారు . అంతేకాదు విద్య కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు సహాయం చేయడం.. అవసరమైన చోట సేవా కార్యక్రమాలు నిర్వహించడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఏది ఏమైనా విజయ్ దేవరకొండ గొప్పతనం మరోసారి నిరూపితం అయ్యింది అంటూ అభిమానులు, నెటిజన్స్ ప్రసంశలు కురిపిస్తున్నారు.