• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కృష్ణా న‌దిలో...

కృష్ణా న‌దిలో ప‌డిపోయేదాన్ని..అప్పుడే ఎన్టీఆర్ అలా చేసారు!

| తాజాగా అన్న‌గారితో ఉన్న అనుబంధాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో గుర్తు చేసినా ఆ నాటి జ్ఞాప‌కాల్లోకి వెళ్లారు.

By - Tupaki Desk
Update: 2024-05-01 00:30 GMT

వెట‌ర‌న్ న‌టి రోజా రమణి సినీ ప్ర‌స్తానం గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బాలనటిగా కెరీర్ ప్రారంభించి ఎన్నో చిత్రాల్లో న‌టించారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా .. కేరక్టర్ ఆర్టిస్టుగానూ ప‌రిశ్ర‌మ‌కి సేవ‌లందించారు. న‌ట‌సార్వ‌భౌమ ఎన్టీఆర్ తోనూ చాలా సినిమాలు చేసారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కొన్ని సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించారు. అయితే సినిమా షూటింగ్ స‌మ‌యంలో తానో పెద్ద ప్ర‌మాదం నుంచి బ‌య‌ట ప‌డిన ఘ‌ట‌న‌ని గుర్తు చేసుకున్నారు. ఆ రోజు ఎన్టీఆర్ గారు కాళ్లు ప‌ట్టుకోక‌పోతే పెద్ద ప్ర‌మాదామే జ‌రిగేద‌న్నారు. తాజాగా అన్న‌గారితో ఉన్న అనుబంధాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో గుర్తు చేసినా ఆ నాటి జ్ఞాప‌కాల్లోకి వెళ్లారు. ఆ సంగ‌తులు ఆమె మాట‌ల్లోనే..

'రామారావుగారి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాను. ఆ సినిమా షూటింగ్ విజయవాడ కృష్ణా బ్యారేజ్ పై జరిగింది. నేను ఆ బ్రిడ్జ్ పై నుంచి నదిలో దూకేయాలి. కెమెరా డిపార్టుమెంటువారు బ్రిడ్జ్ క్రింద ఉన్నారు. దూకుతున్నట్టుగా నేను మూమెంట్ ఇవ్వాలి. అయితే కెమెరాలో నా ముఖం కనిపించాలంటే నా కాళ్ల క్రింద స్టూల్ లాంటిది కావాలి. కానీ అది అందుబాటులో లేదు. దగ్గరలో ఓ వ్యక్తి దగ్గర ప్లాస్టింగ్ క్యాన్స్ ఉంటే, వాటిపై నిలబడమని ఎన్టీఆర్ చెప్పారు. ఆ క్యాన్స్ జరగకుండా పట్టుకోమని ఓ అబ్బాయికి చెప్పారు.

ఆ క్యాన్స్ నా బరువు త‌ట్టుకునేలా లేవు. నేను ఎక్కగానే అవి జారిపోయేలా ఉన్నాయి. అలా జారిపోతే నేను నిజంగానే నీళ్లల్లో పడిపోతాను. దీంతో నాలో టెన్ష‌న్ మొద‌లైంది. అది ఎవ‌రికి చెప్పుకోవాలో అర్దం కాలేదు. ఆ క్యాన్స్ జరగకుండా ఆ అబ్బాయి అదుపు చేయ‌లేక‌పోతున్నాడు. నాకేమో టెన్ష‌న్ పెరిగిపోతుంది. అది గమనించిన ఎన్టీఆర్ నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. అమ్మాయి నువ్వేమీ భయపడకు .. నీ యాక్షన్ నువ్వు పెర్ఫెక్ట్ గా చేయి అన్నారు. అప్పుడాయ‌న ఒక చేత్తో ఒక కాలు .. మరో చేత్తో క్యాన్స్ పట్టుకున్నారు. నాకు దైర్యం వ‌చ్చి ఆ సీన్ చేసేసాను.

కానీ ఆయ‌న కాళ్లు ప‌ట్టుకోవ‌డం చూసి నాకు ఏడుపు వ‌చ్చేసింది. అదీ ఎన్టీఆర్ అంటే.. అదీ ఆయన గొప్పతనం' అని చెప్పుకొచ్చారు. రోజార‌మ‌ణి తెలుగులోనే కాదు భార‌తీయ భాష‌ల‌న్నింటిలోనూ ఆమె సినిమాలు చేసారు. త‌మిళం..మ‌ల‌యాళం..క‌న్న‌డం..హిందీ..ఒడియాలో కూడా న‌టించారు.

Tags:    
  • Tollywood 
  • MalayalamMovies 
  • Tamil 
  • RojaRamani 
  • Interview 
  • Actor 
  • FilmIndustry 
  • Ntr 
  • VijayawadaKrishnaBarrage 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS