• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  యశ్ 19 అప్డేట్ ఆగయా.....

యశ్ 19 అప్డేట్ ఆగయా.. పవర్ఫుల్ టైటిల్

| పాన్ ఇండియా స్టార్ యశ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నసమయం ఆసన్నమైంది. యశ్ కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది

By - Tupaki Desk
Update: 2023-12-08 05:28 GMT

పాన్ ఇండియా స్టార్ యశ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నసమయం ఆసన్నమైంది. యశ్ కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. కొద్ది రోజుల క్రితం యశ్ 19వ సినిమాకు సంబంధించి అప్డేట్ రాగా.. మూవీ టైటిల్ మాత్రం అనౌన్స్ చేయలేదు. తాజాగా శుక్రవారం ఉదయం 9.55 గంటలకు టైటిల్ ను మేకర్స్ ప్రకటించారు. దాంతోపాటు టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియోను కూడా రిలీజ్ చేశారు.


యశ్ 19వ సినిమాకు టాక్సిక్ టైటిల్ ను ఖరారు చేశారు మేకర్స్. ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అన్న ట్యాగ్ లైన్ ను కూడా యాడ్ చేశారు. ఇది టైటిల్‌ అనౌన్స్‌మెంటే అయినప్పటికీ ఆ వీడియోలో యశ్‌ లుక్‌ను కూడా రివీల్‌ చేశారు. కానీ అది క్లారిటీగా కనిపించడం లేదు. టాక్సిక్‌ పేరు బ్యాక్‌గ్రౌండ్‌లో తుపాకీతో యశ్ కనిపించారు.


మరోవైపు, ఈ చిత్రాన్ని కేవీన్‌ఎన్‌ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ మూవీ తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ తో పాటు ఇతర వివరాలను మేకర్స్ వెల్లడించలేదు. త్వరలోనే ఈ వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.


కేజీఎఫ్‌ సినిమాలతో యశ్‌ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాకీ భాయ్‌గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. పాన్ ఇండియా స్టార్ గా తనకంటూ ఫ్యాన్‌ బేస్ సంపాదించుకున్నారు. అయితే చాలా నెలలుగా కొత్త సినిమాను ప్రకటించలేదు యశ్. తన తర్వాతి సినిమా కేజీఎఫ్‌ చిత్రాలను మించి ఉండాలన్న ఉద్దేశ్యంతో కథల ఎంపిక కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారట.


పదుల సంఖ్యలో కథల్ని విని యశ్ పక్కకు పడేశారట. దాదాపు సంవత్సరం నుంచి కథల్ని వింటూనే ఉన్నారట. ఫ్యాన్స్‌ అయితే యశ్‌ కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసి అలసిపోయి సోషల్‌ మీడియా వ్యాప్తంగా అసహనం కూడా వ్యక్తం చేశారు. యశ్‌ మాత్రం మంచి కథ కోసం వెతికి వెతికి చివరకు టాక్సిక్‌ కథకు ఓకే చేప్పారు. మరికొద్దిరోజుల్లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది.

Full View
Tags:    
  • Yash19title 
  • Rockingstar 
  • Yash 
  • Kvnproductions 
  • Yash19 
  • Toxic 
  • Saipallavi 
  • Filmindustry 
  • Geetumohandas 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS