ఆమె యాక్టింగ్‌కు 'ఫిదా' అయిపోయా

ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న రితికా ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డిస్తున్నారు.;

Update: 2025-09-11 06:32 GMT

అశోక వ‌నంలో అర్జునక‌ళ్యాణం, హాయ్ నాన్న సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచయ‌మైన రితికా నాయ‌క్ ప్ర‌స్తుతం తేజ స‌జ్జ తో క‌లిసి మిరాయ్ అనే సూప‌ర్ హీరో సినిమాలో న‌టించారు. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మిరాయ్ సెప్టెంబ‌ర్ 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న రితికా ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డిస్తున్నారు.

అదే పెద్ద ఛాలెంజ్

త‌న‌కు సూప‌ర్ హీరోస్ సినిమాలంటే ఇష్ట‌మ‌ని చెప్పిన రితికా, మిరాయ్ లో సూప‌ర్ ప‌వ‌ర్స్ ఉన్న యువ‌తిగా క‌నిపించ‌బోతున్న‌ట్టు తెలిపారు. కార్తీక్ ఈ క‌థ చెప్పిన‌ప్పుడు ఆడియ‌న్స్ లో ఒక‌రిగానే దాన్ని విన్నాన‌ని, సినిమాలోని ల‌వ్, యాక్ష‌న్ అంశాలు బాగా న‌చ్చి వెంట‌నే ఓకే చెప్పిన‌ట్టు తెలిపారు రితికా. రియ‌ల్ లైఫ్ లో తానెప్పుడూ ఏదొక‌టి మాట్లాడుతూనే ఉంటాన‌ని, కానీ ఈ సినిమాలో దానికి పూర్తి భిన్న‌మైన పాత్ర‌ను చేశాన‌ని, అదే త‌న‌కు చాలా పెద్ద ఛాలెంజ్ గా అనిపించింద‌ని ఆమె చెప్పారు.

డైరెక్ట‌ర్ నాకు త‌మ్ముడు

తేజ చాలా స్వీట్ ప‌ర్స‌న్ అని చెప్పిన రితికా, అత‌ని యాక్టింగ్ లో సినిమాపై ఉన్న డెడికేష‌న్ క‌నిపిస్తుందన్నారు. మంచు మ‌నోజ్, జ‌గ‌ప‌తి బాబు, శ్రియా లాంటి వారితో స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం చాలా మంచి ఎక్స్‌పీరియెన్స్ అని, డైరెక్ట‌ర్ కార్తీక్ త‌న‌ను అక్క అని పిలిస్తే, తాను అత‌న్ని త‌మ్ముడు అని పిలిచేదాన్న‌ని, అత‌ని బ‌ర్త్ డే అక్టోబ‌ర్ 27, త‌న బ‌ర్త్ డే అక్టోబ‌ర్ 28. ఇయ‌ర్ తో ప‌న్లేకుండా ఓ రోజు ముందు పుట్టాన‌ని త‌న‌ను అక్క అని పిలిచేవార‌ని చెప్పుకొచ్చారు రితికా నాయ‌క్.

యాక్ష‌న్ క‌థ‌ల్లో నటించాల‌నుంది

తెలుగు ఆడియ‌న్స్ కు మొద‌టి రెండు సినిమాల‌తోనే చాలా ద‌గ్గ‌ర‌య్యాన‌ని, మిరాయ్ తో వారికి మ‌రింత చేరువ‌వ్వ‌డంతో పాటూ మంచి పేరు కూడా వ‌స్తుంద‌ని చెప్పారు. యాక్ష‌న్ క‌థ‌ల్లో న‌టించాల‌నే కోరిక ఉంద‌ని చెప్పిన రితికా, ఫిదా సినిమా చూసి సాయి ప‌ల్ల‌విని స్పూర్తిగా తీసుకున్నాన‌ని, ఆమె క‌ళ్ల‌తోనే ఎక్స్‌ప్రెష‌న్స్ ను ప‌లికించ‌గ‌ల‌ద‌ని చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం తాను వ‌రుణ్ తేజ్ తో ఓ సినిమా, డ్యూయెట్ అనే మూవీ తో పాటూ మ‌రికొన్ని సినిమాలు రెడీగా ఉన్నాయ‌ని, ఆల్రెడీ త‌న‌కు 90% తెలుగు అర్థ‌మ‌వుతుంద‌ని, నెక్ట్స్ మూవీలో సొంత డ‌బ్బింగ్ చెప్ప‌డానికి ట్రై చేస్తాన‌ని రితికా చెప్పారు.

Tags:    

Similar News