హీరోయిన్ ని ఎవరైనా అక్కా అని పిలుస్తారా?
ఇండస్ట్రీలో సొదర..సొదరీ భావం అన్నది ఇండస్ట్రీ నుంచి వచ్చే వారసుల విషయంలో తప్ప బయట వారి విషయంలో పెద్దగా కనిపించదు.;
ఇండస్ట్రీలో సొదర..సొదరీ భావం అన్నది ఇండస్ట్రీ నుంచి వచ్చే వారసుల విషయంలో తప్ప బయట వారి విషయంలో పెద్దగా కనిపించదు. ఆ రకమైన పిలుపులు కూడా ఎక్కడా వినిపించవు. అలాంటి వాతావరణం కూడా కనిపించదు. నిజంగా అలాంటి వాతావరణమే కనిపిస్తే లైంగిక దాడులు జరుగుతు న్నాయి? అన్నదే ఎందుకంతగా హైలైట్ అవుతుంది. చిత్ర పరిశ్రమ అంటే కాస్టింగ్ కౌచ్ తో నిండిపోయి ఉంటుందని నిరం తరం ఎప్పటికప్పుడు ఆరోపణలు వస్తూనే ఉంటాయి. ఈ విషయంలో ఏ చిత్ర పరిశ్రమ మినహాయింపు కాదు.
చివరికి చిన్న పరిశ్రమగా భావించిన మాలీవుడ్ బాగోతం కూడా హేమ కమిటీ నివేదికతో బట్టబయలైన సంగతి తెలిసిందే. ప్రధానంగా సినిమా రంగమంటే? చిన్నచూపు భావన ఇక్కడే ఏర్పడుతుందనే వాదన చాలా కాలంగానే ఉంది. ఆ సంగతి పక్కన బెడితే? టాలీవుడ్ లో కూడా ఓ మంచి అక్క-తమ్ముడు ఉన్నారని తాజాగా వెలుగులోకి వచ్చింది. తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమేని 'మిరాయ్' చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా రితికా నాయక్ నటిస్తోంది.
ఈ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ కార్తీక్ ని రితికా నాయక్ తమ్ముడు అని పిలిచేదిట. కార్తీక్ కూడా ఆమెను ఓ సోదరిగా భావించి అక్క అని అంతే ప్రేమాభిమానంతో పిలిచేవాడుట. ముందుగా అక్కా అని పిలిచింది కార్తీక్. ఆ తర్వాత రితికా తమ్ముడి గా భావించినట్లు తెలిపింది. అలా ఇద్దరు ఇండస్ట్రీలో అక్క--తమ్ముడు అయ్యారు. ఇద్దరి మధ్య ఒక్క రోజు మాత్రమే వ్యత్యాసం ఉంది. రితిక ఒక రోజు పెద్దది. అందుకే అలా ఫిక్సైనట్లు రితిక తెలిపింది.
కానీ ఇలా పిలుపించుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. హీరో-హీరోయిన్ మధ్య అయితే ఇలాంటి పిలుపులు దరి దాపుల్లో కూడా రావు. ఒక సినిమాలో కలిసి జంటగా నటించినా...మరో సినిమాలో అదే హీరోయిన్ అదే హీరోకి చెల్లి పాత్ర పోషించినా? ప్రీ రిలీజ్ ఈవెంట్లలో హీరోని అన్నయ్యా? అని పిలిస్తే తెగ ఫీలైపోతుంటారు. ఆ మధ్య ఓ సీనియర్ స్టార్ కూడా అలాంటి పిలుపులు తెర వరకే పరిమితం చేద్దామని బాహాటంగానే అనేసారు.