కరూర్ తొక్కిసలాట ఘటనపై రిషబ్ శెట్టి రియాక్షన్!

గత కొద్ది రోజుల నుండి ఎక్కువగా విమాన ప్రమాదాలు, తొక్కిసలాటలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.;

Update: 2025-10-08 12:25 GMT

గత కొద్ది రోజుల నుండి ఎక్కువగా విమాన ప్రమాదాలు, తొక్కిసలాటలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలా కుంభమేళ జరిగిన సమయంలో,పుష్ప-2 విడుదలైన టైంలో, రీసెంట్ గా కరూర్ లో జరిగిన రాజకీయ ప్రచార ర్యాలీ సమయంలో ఈ తొక్కిసలాట జరిగి ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. అయితే ప్రస్తుతం కరూర్ తొక్కిసలాట గురించే ఎక్కువ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కరూర్ తొక్కిసలాట పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంతార హీరో రిషబ్ శెట్టి.

ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "కరూర్ తొక్కిసాలాట అనేది ఉద్దేశపూర్వకంగా ఎవరు చేసింది కాదు.ఇది అనుకోకుండా జరిగిన ఒక దురదృష్టకరమైన ఘటన. అలాగే ఈ తొక్కిసలాట అనేది ఒక్కరి తప్పు కాదు. సమిష్టి పొరపాటని నేను భావిస్తున్నాను.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పోలీసులపై, ప్రభుత్వంపై నిందలు వేయడం చాలా ఈజీ. కానీ ఎక్కువ జనం ఉన్నప్పుడు వారిని నియంత్రించడం అనేది చాలా పెద్ద సమస్య. ఈ తొక్కిసలాట జరిగే ముందే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సింది. చాలామంది అభిమానులు తమ అభిమాన హీరో సినిమా విడుదలైనప్పుడు పాలాభిషేకాలు చేస్తూ హడావిడి చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి ఘటన జరగడం అనేది నిజంగా దురదృష్టకరం." అంటూ కరూర్ తొక్కిలాటపై స్పందించారు కాంతార నటుడు రిషబ్ శెట్టి.

కరూర్ తొక్కిసలాట గురించి చూసుకుంటే.. గత నెల 27న టీవీకే పార్టీ అధినేత తమిళ నటుడు విజయ్ దళపతి కరూర్ లో ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. అయితే ఈ ప్రచార ర్యాలీలో పాల్గొన్న సమయంలో విజయ్ టీవీకే పార్టీ వాళ్లు కేవలం 10 వేల మందికి మాత్రమే పర్మిషన్ తీసుకోగా..హీరో విజయ్ ని చూడడానికి మాత్రం లక్ష కంటే ఎక్కువ మంది రావడంతో తక్కువ ప్లేస్ లో అంత మంది ఒకేసారి గుమిగూడడంతో కిక్కిరిసిపోయి ఈ తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది. అలా విజయ్ ని చూడ్డానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు విజయ్ రావడంతో ఒక్కసారిగా ఎగబడేసరికి ఈ తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది.

ఈ తొక్కిసలాటలో దాదాపు 41 మంది మరణించగా.. 60 మందికి పైగా గాయాలయ్యాయి. ఇప్పటికే ఈ తొక్కిసలాటలో మరణించిన వారికి విజయ్ 20 లక్షల విరాళం ప్రకటించారు. అలాగే ప్రభుత్వం కూడా చనిపోయిన కుటుంబాలకి విరాళం ప్రకటించింది. రీసెంట్ గా కరూర్ తొక్కిసలాటలో చనిపోయిన మృతుల కుటుంబాలను విజయ్ వీడియో కాల్ ద్వారా పరామర్శించారు.

Tags:    

Similar News