సినిమాను తలపిస్తున్న ఐపీఎల్ స్టార్ ప్రేమ కథ.. స్పోర్ట్స్ డ్రామా తీసేయొచ్చు!
ఆ పరిచయం పెళ్లి వరకు ఎలా దారితీసిందనే విషయాన్ని తాజాగా ఓ వెబ్సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టారు. మరి రింకూ సింగ్, ప్రియా సరోజ్ ల ప్రేమ ఎక్కడ ? ఎలా మొదలైందో? ఇప్పుడు తెలుసుకుందాం..;
సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల లవ్ స్టోరీస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కేవలం సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు పాలిటిక్స్ లో,అలాగే క్రికెట్ రంగంలో రాణించే వారి లవ్ స్టోరీస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి.ఇప్పటికే ధోని, సచిన్,విరాట్ కోహ్లీ వంటి స్టార్ క్రికెటర్లు ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. అయితే ఇదే కోవకి చెందుతారు త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న ఐపీఎల్ ప్లేయర్ రింకూ సింగ్.. రీసెంట్ గానే రింకూ సింగ్ ఎంపీ ప్రియా సరోజ్ ల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. అయితే ఎంగేజ్మెంట్ జరిగిన చాలా రోజులకి తమ మధ్య పరిచయం ఎలా ఏర్పడింది.? ఆ పరిచయం పెళ్లి వరకు ఎలా దారితీసిందనే విషయాన్ని తాజాగా ఓ వెబ్సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టారు. మరి రింకూ సింగ్, ప్రియా సరోజ్ ల ప్రేమ ఎక్కడ ? ఎలా మొదలైందో? ఇప్పుడు తెలుసుకుందాం..
ఇన్నాళ్లకు తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిన రింకు సింగ్..
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యే వారితో ప్రేమలో పడుతున్నారు. అలా ఎంపీ ప్రియా సరోజ్, రింకూ సింగ్ ల ప్రేమ కూడా అలాగే మొదలైందట. కరోనా టైం అనగా 2022లో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ విషయం గురించి ఐపీఎల్ క్రికెట్ ప్లేయర్ రింకూ సింగ్ ఓ స్పోర్ట్స్ వెబ్సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "ప్రియా సరోజ్ తో మొదట నేనే మాట్లాడడానికి ట్రై చేశా. అయితే ఎంపీ ప్రియా సరోజ్ నా ఫ్యాన్ పేజీలో ఉంది. అలా ఒక రోజు నా ఫ్యాన్ పేజీలో ప్రియా స్వగ్రామంలో జరిగిన ఓటింగ్ కి సంబంధించిన ఒక ఫోటో వైరల్ అయింది. అయితే ఆ ఫోటో ఫ్యాన్ పేజీలో వచ్చిన సమయంలో ఫస్ట్ టైం ఆమెను చూశాను. చూడగానే ప్రియా నాకు చాలా బాగా నచ్చింది. అంతేకాదు పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి. నాకు పర్ఫెక్ట్ జోడి అనిపించింది. ఆ తర్వాత ప్రియాకి పర్సనల్గా మెసేజ్ చేద్దామనుకున్నాను. కానీ ఆమె ఏమనుకుంటుందో అని ధైర్యం చాలక చివరికి నాలో ఉన్న ఆలోచనలు పక్కన పెట్టేసా.
స్పోర్ట్స్ డ్రామా కి మంచి స్టఫ్..
ఆ తర్వాత కొద్ది రోజులకి ప్రియా ఇంస్టాగ్రామ్ లో నా రెండు ఫోటోలకి లైక్ కొట్టింది.దాంతో ధైర్యం చేసి ఆమెతో ఎలాగైనా మాట్లాడాలనుకున్నాను. ఆ తర్వాత ఒకసారి మెసేజ్ చేస్తే ఆమె నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలా ఇద్దరి మధ్య ఇంస్టాగ్రామ్ చాటింగ్ నుండి మొదలు నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకొని ఒకరి అభిప్రాయాలు ఒకరం తెలుసుకోవడం స్టార్ట్ చేశాం. అలా ఒకానొక సమయంలో మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ గురించి ఒకరికొకరం చెప్పుకోవడంతో మా మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది.ఆ తర్వాత కొద్ది రోజుల ప్రేమలో ఉండి ఫైనల్ గా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అలా ఈ ఏడాది జూన్ లో ప్రియాతో నా ఎంగేజ్మెంట్ జరిగింది" అంటూ తన లవ్ స్టోరీని బయటపెట్టారు రింకూ సింగ్.. ఇకపోతే రింకు సింగ్ మాటలు విన్న తర్వాత వీరిద్దరి లవ్ స్టోరీ తో ఒక మంచి స్పోర్ట్స్ డ్రామా తీయొచ్చు అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
వాయిదా పడ్డ రింకూ సింగ్ పెళ్లి..
అయితే రింకూ సింగ్,ప్రియా సరోజ్ ల పెళ్లి నవంబర్లో జరగబోతోందని మొదట వార్తలు వినిపించినప్పటికీ .. వరుసగా ఇంటర్నేషనల్ సీజన్,దేశివాళీ టోర్నమెంట్ లు ఉన్న కారణంగా రింకూ సింగ్ పెళ్లి వాయిదా పడ్డట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఎవరీ ప్రియా సరోజ్..
ప్రియా సరోజ్ విషయానికి వస్తే.. సమాజానికి సేవ చేయాలి అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన ప్రియా సమాజ్ వాదీ పార్టీలో చేరి ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లోని మచిలీషెహర్ అనే నియోజకవర్గం నుండి పోటీ చేసింది. అలా ఈ ఎన్నికల్లో బిజెపి పార్టీ తరఫున నిలబడ్డ బిపి సరోజ్ ను 35 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించింది.