• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రీ రిలీజ్ రికార్డులు.....

రీ రిలీజ్ రికార్డులు.. టాప్ లిస్ట్ ఇదే!

| కానీ దళపతి విజయ్ ఫ్యాన్ మానియా కారణంగా గిల్లీ ఐదు రోజుల్లోనే రికార్డు స్థాయి కలెక్షన్స్ వసూళ్లు చేయడం గొప్ప విషయమని చెప్పాలి.

By - Tupaki Desk
Update: 2024-04-26 11:30 GMT

గత కొన్నేళ్ల నుంచి సౌత్ ఇండియాలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలను మరల 4K క్వాలిటీతో డిజిటలైజ్ చేసి థియేటర్ లలో ప్రదర్శిస్తున్నారు. ఇలా రీ రిలీజ్ అవుతున్న సినిమాలకి ఫ్యాన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగులో పోకిరి సినిమాతో ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. తర్వాత స్టార్ హీరోల చిత్రాలను స్పెషల్ అకేషన్స్ లో రీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు.

తెలుగులో మొదలైన ఈ ట్రెండ్ తరువాత తమిళ్, మలయాళీ, కన్నడ భాషలకి కూడా విస్తరించింది. ఇప్పటివరకు ఇలా రీ రిలీజ్ అయిన సినిమాలలో హైయెస్ట్ కలెక్షన్ సొంతం చేసుకున్న మూవీగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి కొద్ది రోజుల ముందు వరకు ఉంది. ఈ సినిమా ఏకంగా 7.46 కోట్ల గ్రాస్ రాబట్టి టాప్ లో ఉండేది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ సూపర్ హిట్ మూవీ గిల్లీ (ఒక్కడు రీమేక్) మొదటి రోజే బ్రేక్ చేయడం విశేషం.

ఐదు రోజులలో ఈ సినిమా ఏకంగా 17.70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు గిల్లీ రీరిలీజ్ సినిమాల కలెక్షన్స్ పరంగా టాప్ లోకి దూసుకొచ్చింది. ఈ రీ రిలీజ్ సినిమాల కలెక్షన్స్ లో మూడో స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్ వచ్చిన సూపర్ హిట్ మూవీ బిజినెస్ మెన్ నిలిచింది. ఈ సినిమా 5.85 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.

నాలుగో స్థానంలో 4.90 కోట్ల గ్రాస్ తో మోహన్ లాల్ సూపర్ హిట్ మూవీ స్పదికం ఉంది. ఐదో స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో చేసిన మొట్టమొదటి చిత్రం సింహాద్రి ఉండటం గమనార్హం. ఈ సినిమా 4.60 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తర్వాత తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది మూవీ 3.52 కోట్ల గ్రాస్ తో ఆరో స్థానంలో సాధించింది. ఈ చిత్రానికి ఫస్ట్ రిలీజ్ లో కూడా ఈ స్థాయి కలెక్షన్స్ రాకపోవడం విశేషం.

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సూర్య చేసిన సూపర్ హిట్ మూవీ సూర్య సన్నాఫ్ కృష్ణన్ 3.40 కోట్ల క్రాస్ కలెక్ట్ చేసి టాప్ 7గా నిలిచింది. దళపతి విజయ్ గిల్లీ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కడు సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. అయితే ఒక్కడు సినిమా రీ రిలీజ్ లో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేదు. కానీ దళపతి విజయ్ ఫ్యాన్ మానియా కారణంగా గిల్లీ ఐదు రోజుల్లోనే రికార్డు స్థాయి కలెక్షన్స్ వసూళ్లు చేయడం గొప్ప విషయమని చెప్పాలి.

రీ రిలీజ్ మూవీస్ టాప్ టోటల్ కలెక్షన్స్

గిల్లి - 17.70CR(6-రోజులు)*

ఖుషి - 7.46CR

బిజినెస్ మెన్ – 5.85Cr

స్పదికం(మలయాళం) - 4.90CR

సింహాద్రి - 4.60CR

ఈనగరానికి ఏమైంది – 3.52CR

సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ – 3.40CR

Tags:    
  • Rereleasemovie 
  • Topcollections 
  • Gilli 
  • Khushi 
  • Businessmen 
  • Spadikam 
  • Simhadri 
  • Eenagaranikiemaindhi 
  • Suryasonofkrishnan 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS