'బాధతో పాటు కోపాన్ని కలిగిస్తున్నాయి'- రేణు దేశాయ్ ఫుల్ ఫైర్!

రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హేమలత లవణం పాత్ర పోషించింది.

Update: 2024-05-18 12:05 GMT

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సీనియర్ నటి రేణు దేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహ బంధానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఏవో మనస్పర్థలు రావడంతో పవన్, రేణు విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటి నుంచి ఇద్దరు కూడా ఎవరి లైఫ్ వాళ్లు హ్యాపీగా గడుపుతున్నారు. రేణు తన ఇద్దరు పిల్లలు అకీరా నందన్, ఆద్య బాధ్యతలు తీసుకుంది. అయితే రేణు ఇటీవల సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.


రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హేమలత లవణం పాత్ర పోషించింది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తుందని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటోంది రేణు దేశాయ్. తన కూతురు, కొడుకు ఫోటోలు షేర్ చేస్తుంటోంది. కొన్నిసార్లు పవన్ ప్రస్తావనను నెటిజన్లు తీసుకొస్తే గట్టిగా స్పందిస్తుంటోంది. ఆ మధ్య అకీరా నందన్‌ ను తమ అన్న కొడుకు అన్నప్పుడల్లా రేణు దేశాయ్ ఫైర్ అయింది.

అయితే కొన్ని నెలలుగా రేణు.. జంతువుల సంరక్షణకు, చిన్నారుల ఆహారానికి సహాయం చేస్తోంది. ఈ నేపథ్యంలో డొనేషన్లకు డబ్బులు సరిపడకపోతే ఫాలోవర్స్ ను అడిగింది. ఆ తర్వాత ఎవరో హెల్ప్ చేశారని కూడా వీడియో ద్వారా అప్డేట్ ఇచ్చింది. ఆ సమయంలో ఓ నెటిజన్.. 'మా పవన్ అన్నయ్య లా గోల్డెన్ హార్ట్ వాళ్లది' అని కామెంట్ పెట్టాడు. దీంతో రేణు దేశాయ్ ఫుల్ ఫైర్ అయింది. ప్రతిసారి ఎక్స్ హస్బెండ్ తో ఎందుకు కంపేర్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది.

Read more!

"ఎందుకు ప్రతిసారి నా పోస్టుల కింద నా మాజీ భర్తతో కంపేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి వాళ్లను చాలా మందిని బ్లాక్ చేశాను, డిలీట్ కూడా చేశాను. నేను సింగిల్ గా జంతువుల సర్వీస్ చేస్తున్నాను. నాకు పదేళ్లు ఉన్నప్పటి నుంచి చేస్తున్నాను. దీనికి నా ఎక్స్ హస్బెండ్ కు ఎలాంటి సంబంధం లేదు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతి పోస్ట్ కు కంపేర్ చేస్తూ కామెంట్స్ పెట్టడం ఆపండి. నాలాగా యానిమల్స్ పై ప్రేమ, కేరింగ్ ఆయన చూపించడు" అని కామెంట్ చేసింది.

ఆ తర్వాత ఆమె పెట్టిన కామెంట్ ను స్క్రీన్ షాట్ తీసి తన ఇన్‌ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది రేణు దేశాయ్. "ఇలాంటి రిప్లైలు నాకు చాలా బాధతో పాటు కోపాన్ని కలిగిస్తున్నాయి. ఎన్నేళ్లు అయినా నా సొంతంగా నేనేం చేసినా దాన్ని నా మాజీ భర్తతో కంపేర్ చేస్తారు. ఆయనతో నాకు ఎలాంటి పర్సనల్ ప్రాబ్లం లేదు. కానీ ఆయన ఫాలోవర్స్ నన్ను నన్నుగా ముందు వదిలేయండి" అని పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం రేణు దేశాయ్ కామెంట్ అండ్ ఇన్ స్టా స్టోరీ నెట్టింట వైరల్ గా మారాయి.

Tags:    

Similar News