రేణు దేశాయ్.. ఈసారైనా పవర్ఫుల రోల్ దక్కుతుందా?
మాస్ మహారాజా రవితేజ లీడ్ రోల్ లో నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీతో లాంగ్ గ్యాప్ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై మెరిశారు రేణు దేశాయ్.;
సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ గురించి అందరికీ తెలిసిందే. గతంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె.. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. పర్సనల్ వర్క్స్ తో బిజీగా గడిపారు. మళ్లీ ఆమె మూవీల్లోకి రావాలని అప్పట్లో అనేక మంది ఆడియన్స్ కోరుకున్నారు. అనుకున్నట్లే ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చారు.
మాస్ మహారాజా రవితేజ లీడ్ రోల్ లో నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీతో లాంగ్ గ్యాప్ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై మెరిశారు రేణు దేశాయ్. ఆ సినిమాలో సామాజిక కార్యకర్త హేమలత లవణం రోల్ లో కనిపించారు. హీరో రోల్ ను ప్రభావితం చేసే కొన్ని కీలక సన్నివేశాల్లో నటించిన రేణు.. తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించారు.
ఆడియన్స్ ను ఆకట్టుకుని, విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. కానీ రీ ఎంట్రీలో ఫస్ట్ మూవీతో అనుకున్న స్థాయిలో హిట్ సాధించలేకపోయారు. ఆ తర్వాత రేణు దేశాయ్ మరో కొత్త మూవీలో యాక్ట్ చేస్తున్నట్లు అనౌన్స్మెంట్ రాలేదు. అయితే ఇప్పుడు మరో సినిమాలో కనిపించనున్నారు. తాజాగా పూజ సెర్మనీ జరిగింది.
కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న 16 రోజుల పండుగ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు రేణు దేశాయ్. నిర్మాత డీఎస్ రావు కుమారుడు కృష్ణ దమ్మలపాటి హీరోగా నటిస్తున్న ఆ మూవీని దర్శకుడు సాయికిరణ్ అడవి తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాలో రేణు దేశాయ్ ఇప్పుడు ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది.
అయితే 16 రోజుల పండుగలో రేణుకు ఎలాంటి రోల్ దక్కుతుందోనని అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. నిజానికి టైగర్ నాగేశ్వరరావు మూవీలో ఆమెకు మంచి పాత్ర దక్కిందనే చెప్పాలి. కానీ ఇప్పుడు సీనియర్ నటి నదియా సహా పలువురు చేస్తున్న పవర్ ఫుల్ రోల్స్ లాంటి పాత్రల కోసం రేణు దేశాయ్ వెయిట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇప్పటి వరకు ఆమెకు అలాంటి పాత్రలు దక్కలేదు. అందుకే టైగర్ నాగేశ్వరరావు మూవీ తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే 16 రోజుల పండుగ మూవీలోని రోల్ కు సంబంధించిన పార్ట్ ను తనను నెరేట్ చేశాక.. బాగా నచ్చి సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. మరి 16 రోజుల పండుగ మూవీలో రేణు దేశాయ్ పాత్ర ఎలా ఉంటుందో.. ఎలాంటి హిట్ అందుకుంటారో.. ఎంతలా మెప్పిస్తారో వేచి చూడాలి.