• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నిమిషం ముందు రెజీనా అలా.....

నిమిషం ముందు రెజీనా అలా.. తర్వాత ఇలా..

| రవితేజ పవర్ మూవీతో స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నా.. అలా జరగలేదు.

By - Tupaki Desk
Update: 2024-09-10 23:30 GMT

రెజీనా కసాండ్రా.. తెలుగు సినీ ఇండస్ట్రీలో తక్కువ టైమ్ లో ఎక్కువ ఫేమస్ అయిన హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. SMS- శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు.. డెబ్యూ మూవీతో అందరినీ ఆకట్టుకుంది. తన యాక్టింగ్ స్కిల్స్ తో ఫిదా చేసింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంది. కానీ ఆమెకు సరైన బ్రేక్ రాలేదు. రవితేజ పవర్ మూవీతో స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నా.. అలా జరగలేదు.

ఆ తర్వాత పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలు చేసినా ఆమెకు కలిసిరాలేదు. దీంతో రెజీనాకు తెలుగులో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. కొన్నేళ్లుగా టాలీవుడ్ చిత్రాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. చివరగా శాకినీ డాకినీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమాతో మెప్పించలేకపోయింది. ఇప్పుడు ఉత్సవం చిత్రంతో త్వరలోనే సందడి చేయనుంది. యంగ్ హీరో దిలీప్ ప్రకాష్ కు జోడీగా నటించింది.

సెప్టెంబర్ 13వ తేదీన ఉత్సవం మూవీ రిలీజ్ కానుండగా.. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అయింది రెజీనా. ఆ సమయంలో సినిమా సినిమాకు ఎందుకు గ్యాప్ తీసుకుంటున్నారనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీంతో తాను అసలు గ్యాప్ అనేది తీసుకోవడం లేదని తెలిపింది. తాను నటిస్తున్న చిత్రాల గురించి తెలుసుకుని ప్రశ్న అడగండని వ్యాఖ్యానించింది. దీంతో ఆమెకు కాస్త కోపం వచ్చినట్లు అర్థమైంది. అక్కడికి వెంటనే మళ్లీ వేరేలా మాట్లాడింది.

సినిమాల మధ్య గ్యాప్ తీసుకుంటున్నానని, లేకుంటే మూవీలు చేయడం లేదని అనిపించి ఉంటే అది తన ప్లానింగ్ లోపం అని తెలిపింది రెజీనా. దానిని ఒప్పుకుంటానని చెప్పింది. ఇక అలాంటి ఫీలింగ్ రాకుండా సినిమాల్లో నటిస్తానని వెల్లడించింది. అలా ముందు చూపించిన చిన్న కోపాన్ని కవర్ చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

అయితే తెలుగులో రెజీనా సందడి తక్కువే ఉన్నా.. హిందీ, తమిళ భాషల్లో ఆఫర్లు అందుకుంటోంది. గోపీచంద్ మలినేని, సన్నీడియోల్ కాంబోలో రానున్న సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్ లో రెండు చిత్రాల్లో యాక్ట్ చేస్తోంది. అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్లు ఇంకా రాలేదు. తమిళంలో రీసెంట్ గా కంజురింగ్ కన్నప్పలో నటించింది. తెలుగులో మాత్రం చాలా రోజుల తర్వాత ఉత్సవం మూవీతో వస్తోంది. మరి ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Kollywood 
  • Filmindustry 
  • ShakiniDakini 
  • Dileep 
  • Filmpromotions 
  • ReginaCassandra 
  • Media 
  • Socialmedia 
  • Films 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS