చిన్నారి అరుంధతిని ఇప్పుడు చూశారా...?

అనుష్క హీరోయిన్‌ గా నటించిన అరుంధతి సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Update: 2024-05-07 23:30 GMT

అనుష్క హీరోయిన్‌ గా నటించిన అరుంధతి సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనుష్క కెరీర్‌ లోనే కాకుండా టాలీవుడ్‌ సినీ చరిత్రలోనే ఎప్పటికి నిలిచి పోయే సినిమా అరుంధతి. అలాంటి సినిమాలో కనిపించిన ప్రతి చిన్న పాత్ర కూడా ఎప్పటికి గుర్తుండిపోతుంది.

అలాంటి అరుంధతిలో చిన్నప్పటి అనుష్క గా కనిపించిన బాల నటిని అంత తేలికగా మర్చిపోగలమా... చిన్నారి అరుంధతిగా దివ్య నగేష్ నటించింది. 1988 ఏప్రిల్‌ 13న కేరళలోని అలప్పుజలో జన్మించిన దివ్య నగేష్‌ 2014 లో తమిళ చిత్రం సేవమ్‌ తో బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేసి చిన్నతనంలోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

బాల నటిగా దివ్య నగేష్ చాలా సినిమాల్లో నటించింది. అరుంధతి సినిమాలో నటించిన తర్వాత ఈ అమ్మాయికి మరింతగా పాపులారిటీ దక్కింది. అయితే అదృష్టం కలిసి రాకపోవడంతో ఆ తర్వాత ఎక్కువ ఆఫర్లు రాలేదు. పైగా వయసు పెరగడం వల్ల బాల నటిగా ఆఫర్లు రాలేదు.

పెద్ద అయ్యాక హీరోయిన్ గా సినిమాలు చేసేందుకు సిద్ధం అయ్యింది. అది కూడా ఆమెకు కలిసి రాలేదు. రెండు మూడు సినిమాల్లో హీరోయిన్‌ గా నటించిన దివ్య నగేష్‌ సోషల్‌ మీడియాలో సందడి చేయడం తప్ప హీరోయిన్‌ గా పెద్దగా ప్రభావం చూపించలేక పోయింది.

Read more!

చిన్నారి అరుంధతిగా దివ్య నగేష్ ను చూసిన తెలుగు ప్రేక్షకులు ఇతర హీరోల సరసన హీరోయిన్‌ గా ఒప్పుకోవడం లేదు. పైగా కాస్త బొద్దుగా ఉండటం కూడా ఆమెకు ప్రతికూల అంశంగా మారింది. దివ్య నగేష్ అరుంధతిలో నటించే సమయంకు ఇప్పటికి చాలా మార్పు వచ్చింది.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో దివ్య నగేష్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. మూడు పదుల వయసు ఇప్పటికే దాటిన దివ్య నగేష్ మళ్లీ సినిమాల్లో నటించే అవకాశాలు చాలా తక్కువ. హీరోయిన్ గా కాకున్నా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఏమైనా ఆఫర్లు వస్తాయేమో చూడాలి.

Tags:    

Similar News