పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రెబా మోనిక జాన్.. అప్పుడే పేరు కూడా?
ఈ మేరకు తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా జూలై 22న సాయంత్రం 4:15 గంటలకు ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రకటించింది.
ఇటీవలకాలంలో కొంతమంది సెలబ్రిటీలు అలా పెళ్లిళ్లు చేసుకొని.. ఇలా తల్లిదండ్రులవుతూ ఆ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే సామజ వరగమన సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ హీరోయిన్ రెబా మోనిక జాన్ కూడా తల్లి అయింది. మొన్నటి వరకు బేబీ బంప్ తో కూడా ఎంజాయ్ చేస్తూ.. డాన్సులు వేస్తూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసిన ఈ చిన్నది.. ఇప్పుడు పండంటి బిడ్డకు జన్మనిచ్చాను అంటూ ఆ శుభవార్తను అభిమానులతో పంచుకుంది. అంతేకాదు తన భర్త , బిడ్డతో కలిసి పంచుకున్న క్యూట్ ఫోటోని షేర్ చేస్తూ తన పాపకు అప్పుడే పేరు కూడా పెట్టేశాం అంటూ తెలిపింది.
పండంటి పాపకు జన్మనిచ్చిన రెబా మోనిక జాన్..
ఈ మేరకు తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా జూలై 22న సాయంత్రం 4:15 గంటలకు ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రకటించింది. తన కూతురికి కియారా జోసెఫ్ అని పేరు పెట్టినట్లు తెలిపింది. చిన్నారి కియారాను ఓ సూర్య కిరణంగా అభివర్ణించిన రెబా మోనిక.. ప్రస్తుతం తన పాపను తెలుసుకోవడంలో గడుపుతున్నానని , ఈ కొత్త అధ్యాయం చాలా అందంగా , బాగుంది అంటూ తెలిపింది. ఈ మేరకు ఒక సుదీర్ఘ పోస్ట్ ను కూడా పంచుకుంది.
కొత్త అధ్యాయంలో ఎన్నో నేర్చుకుంటున్నాం..
"22.07.2026.. హలో వరల్డ్.. మా ముద్దుల పాపాయి కియారా జోసెఫ్ కు హాయ్ చెప్పండి. మా జీవితాలలో వెలుగులు నింపింది ఈ చిన్న సూర్య కిరణం. గత కొన్ని రోజులుగా ఈ కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తూ.. మా చిన్నారిని మరింత దగ్గరగా తెలుసుకుంటూ.. తనతో మధురమైన క్షణాలను గడుపుతూ.. ఒక కొత్త ప్రాణాన్ని తనలో మోసి ఈ ప్రపంచానికి తీసుకురావడం మహిళా శరీరం చేయగల అద్భుతాలలో ఒకటి. గత తొమ్మిది నెలలుగా నా కూతురు నాకు ఎంతో సహకరించింది. ఎంతో ప్రేమగా చూసుకుంది. ఇప్పుడు మా పాప మా చేతుల్లోకి వచ్చింది. ఈ ప్రపంచాన్ని ఇకపై మా చూపుతో ఆమెకు పరిచయం చేస్తూ.. మేము ముగ్గురం కలిసి ఎన్నో అద్భుతమైన , అందమైన జ్ఞాపకాలను సృష్టించాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము.
మీ అందరి ఆశీస్సులు కావాలి..
మా జీవితంలో ఈ కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాం" అంటూ రెబా మోనిక జాన్ తెలిపింది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ క్యూట్ ఫోటో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటుంది . ఇక పలువురు అభిమానులు, సెలబ్రిటీలు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
చిరకాల మిత్రుడితో ప్రేమ, పెళ్లి..
తన చిరకాల మిత్రుడు జోమన్ జోసెఫ్ ను 2022 జనవరిలో వివాహం చేసుకుంది. వివాహం తర్వాత కూడా సినిమాలలో నటిస్తూ కెరియర్ను కొనసాగిస్తున్న ఈమె.. తాను గర్భం దాల్చిన విషయాన్ని అభిమానులతో స్వయంగా పంచుకుంది. మెటర్నటీ షూట్ , బేబీ షవర్ వేడుకలతో పాటు బేబీ బంప్ తో విహారయాత్రలు, బేబీ బంప్ తో చేసిన డాన్స్ ఇలా ప్రతిదీ కూడా అభిమానులతో పంచుకుంటూ వచ్చి.. అందరిలో క్యూరియాసిటీ పెంచేసింది. ఎట్టకేలకు క్యూట్ క్వీన్ కి జన్మనిచ్చింది ఈ ముద్దుగుమ్మ.