స్వాతిరెడ్డికి పెద్ద ఛాన్సే ఇది!

డీజే బ్యాండ్ లోనూ స్వాతిరెడ్డి ఓ బ్రాండ్ గా మారిపోయింది. అందం, అభిన‌యం రెబాకు అద‌నంగా క‌లిసొచ్చిన అంశాలు.;

Update: 2025-12-31 05:14 GMT

బెంగుళూరు బ్యూటీ రెబా మోనికా జాన్ 'స్వాతి రెడ్డి' పాట‌తో ఎంత ఫేమ‌స్ అయిందో తెలిసిందే. ఒక్క పాట‌తో కుర్రాళ్లనంద‌ర్నీ ఓ రేంజ్ లో ఊపేసింది. డీజే బ్యాండ్ లోనూ స్వాతిరెడ్డి ఓ బ్రాండ్ గా మారిపోయింది. అందం, అభిన‌యం రెబాకు అద‌నంగా క‌లిసొచ్చిన అంశాలు. దీంతో రెబా గురించి సెర్చింగ్ కూడా ఇంట‌ర్నెట్ లో పెరిగింది. కానీ ఆ క్రేజ్ తో టాలీవుడ్ లో కొత్త అవ‌కాశాలైతే అందుకోవ‌డంలో వెనుక‌బ‌డే ఉంది. రెబా టాలీవుడ్ జ‌ర్నీ మూడేళ్ల క్రిత‌మే మొద‌లైంది. 'బూ' అనే చిత్రంతో లాంచ్ అయింది. కానీ ఆ సినిమా వైఫ‌ల్యంతో వెలుగులోకి రాలేదు.

'సామ‌జ‌వర‌గ‌మ‌న‌'తో పేరు ద‌క్కించుకుంది. ఆ సినిమా ఇంకా పెద్ద స‌క్సెస్ అవ్వాలి. కానీ అంద‌రికీ క‌నెక్ట్ అవ్వ‌లేదు. ఆ త‌ర్వాత 'మ్యాడ్ స్క్వేర్' లో స్పెష‌ల్ సాంగ్, సింగిల్ చిత్రంలో గెస్ట్ అపిరియ‌న్స్ తో మెప్పించింది. ఈ రెండు సిని మాల త‌ర్వాత తెలుగులో అవ‌కాశాలే అందుకోలేదు. త‌మిళ‌, మ‌ల‌యాళంలో కూడా సినిమాలు చేసింది. కానీ అవేవి రెబాకు అంత‌గా గుర్తింపు తీసుకురాలేదు. కానీ కోలీవుడ్ లో మాత్రం ద‌ళ‌ప‌తి విజ‌య్ క‌థ‌నాయ‌కుడిగా న‌టిస్తోన్న 'జ‌న నాయ‌గ‌న్' లో మాత్రం ఓ కీల‌క పాత్ర పోషిస్తుంది. ఇందులో హీరోయిన్ గా పూజాహెగ్గే న‌టించినా? రెబా కూడా కీల‌క పాత్ర కావ‌డంతో ఆస‌క్తిక‌రంగా మారింది.

రెబా మోనికాజాన్ కెరీర్ లో బిగ్ ఛాన్స్ ఏదైనా ఉంది? అంటే అది 'జ‌న నాయ‌గ‌న్' చిత్రంగానే చెప్పాలి. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతున్న చిత్ర‌మిది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాపై అంచ‌నాలు అంతకంత‌కు పెంచేసాయి. ఓ వైపు తెలుగు సినిమా 'భ‌గ‌వంత్ కేస‌రి'కి రీమేక్ అనే ప్రచారం జ‌రుగుతోంది. కానీ మేక‌ర్స్ మాత్రం ధృవీక‌రించ‌లేదు. దీంతో ఇదో స‌స్పెన్స్ గా మారింది. రీమేకా? లేక పొలిటిక్ బ్యాక్ డ్రాప్లో విజ‌య్ రాజ‌కీయ జీవితాన్ని భ‌విష్య‌త్ లో పెట్టుకుని తెర‌కెక్కిస్తున్నారా? ఇలా చాలా సందేహాలే ఉన్నాయి.

వీట‌న్నింటికి తెర ప‌డాలంటే రిలీజ్ వ‌ర‌కూ ఆగాల్సిందే. అంత వ‌ర‌కూ మేక‌ర్స్ రివీల్ చేసే అవ‌కాశం లేదు. అందుకు ఛాన్స్ ఉంటే ద‌ర్శ‌కుడు హెచ్ . వినోధ్ ఇప్ప‌టికే చెప్పేసేవాడు. ఈ విష‌యంలో తొలి నుంచి స‌స్పెన్స్ క్యూరియాసిటీ మెయింటెన్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. న‌టుడిగా విజ‌య్ చివ‌రి చిత్రం కావ‌డంతో? ఫ్యాన్స్ భారీ ఎత్తున హ‌డావుడి చేస్తున్నారు. మ‌రి ఈ సినిమా రెబా మోనికా జాన్ కెరీర్ కు ఎంత వ‌ర‌కూ క‌లిసొస్తుందో చూడాలి.

Tags:    

Similar News